జొమాటో సీఈఓ అవుట్: చక్రం తిప్పనున్న దీపిందర్ గోయల్.. అసలు కారణం ఇదేనా !
జొమాటో నుండి మరో బిగ్ న్యూస్ వెలువడింది. కంపెనీ ఫుడ్ డెలివరీ బిజినెస్ సీఈఓ రాకేష్ రంజన్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. దింతో ఇప్పుడు కంపెనీ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ స్వయంగా CEO బాధ్యతలు చేపట్టనున్నారు. అంటే ఇప్పుడు జొమాటో మొత్తం ఒకే వ్యక్తి చేతుల్లో ఉంటుంది. జొమాటో ఫుడ్ డెలివరీ వ్యాపారంలో ఇది వరుసగా రెండవ పెద్ద రాజీనామా, కొంతకాలం క్రితం ఫుడ్ డెలివరీ COO అయిన రింషుల్ చంద్ర కూడా తన పదవికి రాజీనామా చేశారు. అతికొద్దీ కాలంలోనే కంపెనీ సీనియర్ మేనేజ్‌మెంట్ నుండి ఇద్దరు రాజీనామాలు చేయడం గమనార్హం. దింతో జొమాటో లీడర్షిప్ గురించి మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది.

రాకేష్ రంజన్ ఎందుకు రాజీనామా చేసాడంటే : దీనిపై జొమాటో ఎటువంటి ప్రత్యక్ష కారణం చెప్పలేదు, కానీ బిజినెస్ రిస్టక్చర్ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. రాకేష్ రంజన్ కొంతకాలంగా జొమాటో డెలివరీ వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు అంతేకాదు చాల ముఖ్యమైన మార్పులలో కూడా భాగంగా ఉన్నారు. మీడియా నివేదికల ప్రకారం, రాకేష్ రంజన్ పదవి నుంచి వైదొలిగినప్పటికీ సంస్థలోనే కొనసాగనున్నారు.
జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ఇప్పుడు కంపెనీలోని మూడు విభాగాలకు నేరుగా నాయకత్వం వహించనున్నారు. ఇందులో ఫుడ్ డెలివరీ, బ్లింకిట్ (గ్రోసరీ డెలివరీ), హైపర్‌ప్యూర్ (B2B సప్లై చైన్) ఉన్నాయి. దీనితో పాటు రెస్టారెంట్ బుకింగ్‌లు, జొమాటో లైవ్ ఈవెంట్‌ల వ్యాపారాన్ని కూడా చూసుకుంటారు.
జొమాటో ప్లాన్ ఏంటి : జొమాటో ప్రస్తుతం వృద్ధి దశలో ఉంది. ముఖ్యంగా బ్లింకిట్, హైపర్‌ప్యూర్ వంటి వర్టికల్స్‌లో చాలా ప్రోగ్రెస్ జరుగుతున్నాయి. దీపిందర్ గోయల్ 'వన్ జొమాటో' సిద్ధాంతం ఎంత ప్రభావవంతంగా ఉంటుందో అలాగే జొమాటో నిజంగా కస్టమర్లు ఇంకా పెట్టుబడిదారుల అంచనాలను అందుకోగలదా అనేది వేచి చూడాలి.
కుప్పకూలిన జొమాటో షేర్లు: ఈ వార్తల మధ్య నేడు జొమాటో మాతృ సంస్థ ఎటర్నల్ షేర్లు పడిపోయాయి. బిఎస్‌ఇలో ఈ స్టాక్ 1.25 శాతం తగ్గి రూ.236.15 వద్ద ట్రేడవుతోంది. ఈ పతనంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2.27 లక్షల కోట్లకు తగ్గింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ.304.50 కాగా, 52 వారాల కనిష్ట స్థాయి రూ.146.85 వద్ద ఉంది.
2023లో CEOగా రాకేష్ రంజన్ : కంపెనీ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి చేసే లీడర్షిప్ మార్పుల్లో భాగంగా ఈ మార్పు జరిగిందని తెలిపింది. రాకేష్ రంజన్ జూన్ 2023లో CEOగా నియమితులయ్యారు కాగా, గురుగ్రామ్ కంపెనీలో దాదాపు ఎనిమిది సంవత్సరాలు పనిచేసారు. రంజన్ బాధ్యతలు స్వీకరించే సమయానికి జొమాటో అప్పటికే మార్కెట్ లీడర్ గా ఉంది. గత కొన్ని నెలలుగా ఆయన నాయకత్వంలో కంపెనీ ఎంతో వృద్ధిని కొనసాగించింది.


Click it and Unblock the Notifications