Deepinder Goyal: దేశీయ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో CEO దీపిందర్ గోయల్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల కొత్త సర్వీసు అంటూ ప్యూర్‌వెజ్ డెలివరీ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి విమర్శల పాలయ్యారు. కాగా ఇప్పుడు ఆయన రెండవ భార్య గురించిన వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి.
జొమాటో CEO దీపిందర్ గోయల్ ఒక నెల క్రితం మాజీ మెక్సికన్ మోడల్ గ్రెసియా మునోజ్‌ను వివాహం చేసుకున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. ఈ జంట ఫిబ్రవరిలో హనీమూన్ కూడా ముగించుకుని తిరిగి వచ్చినట్లు పేర్కొంది. ఆమె టెలివిజన్ హోస్టింగ్‌తో పాటు లగ్జరీ కన్స్యూమర్ ఉత్పత్తులపై దృష్టి సారించి తన స్టార్టప్‌ను నడుపుతున్నారు.

ఫ్యాషన్ ఇండస్ట్రీలోనూ గ్రెసియా తనదైన ముద్రవేశారు. 2022లో యునైటెడ్ స్టేట్స్‌లో జరిగిన మెట్రోపాలిటన్ ఫ్యాషన్ వీక్‌లో గెలుపొందారు. ఇన్‌స్టాగ్రామ్ బయోలో తాను ఇప్పుడు భారత్‌లోని ఇంట్లో ఉన్నాను అంటూ పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలోని ప్రసిద్ధ ప్రాంతాలను అన్వేషించిన ఫోటోలను సైతం పంచుకున్నారు. ఇక్కడ తన కొత్త జీవితం గురించి ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు.
గ్రెసియాతో గోయల్‌కు ఇది రెండో వివాహంగా తెలుస్తోంది. కొంతకాలం రిలేషన్‌షిప్‌లో ఉన్న అనంతరం వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు సమాచారం. అయితే ఆయన IIT ఢిల్లీలో ఉన్న రోజుల్లో కంచన్ జోషితో పరిచయం ఏర్పడింది. 6 నెలలపాటు ఆమె వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నట్లు ఫోర్బ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా అంగీకరించారు. కాగా ఆమెతో తన కోర్ట్‌షిప్ గురించిన వివరాలనూ వెల్లడించారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications