మీరు ఎప్పుడైనా జోమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు.. ఆ డెలివరీ ఇచ్చే వ్యక్తి నెలకు ఎంత సంపాదిస్తారో అని ఆలోచించారా? రీసెంట్‌గా జోమాటో సీఈఓ దీపిందర్ గోయల్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. డెలివరీ పార్ట్ నర్లు నెలకు భారీగా సంపాదిస్తున్నారని ఆయన చెబితే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉందని గిగ్ వర్కర్స్ (Gig workers) యూనియన్లు మండిపడుతున్నాయి. అసలు ఈ గొడవ ఏంటి? నిజంగా గిగ్ వర్కర్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

దీపిందర్ గోయల్ చెప్పిన లెక్కలివే!
జోమాటో అధినేత దీపిందర్ గోయల్ ఎక్స్ (Twitter) వేదికగా 2025లో తమ డెలివరీ పార్ట్నర్ల ఆదాయం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆయన ప్రకారం.. ఒక డెలివరీ పార్ట్నర్ సగటున గంటకు రూ.102 (టిప్స్ కాకుండా) సంపాదిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా రోజుకు 10 గంటల చొప్పున నెలకు 26 రోజులు పని చేస్తే.. వాళ్ల గ్రాస్ ఇన్కమ్ దాదాపు రూ.26,500 వరకు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. పెట్రోల్, మెయింటెనెన్స్ ఖర్చులు పోను కనీసం రూ.21,000 చేతికి అందుతుందని ఆయన లెక్కలు వివరించారు.
ట్విస్ట్ ఇచ్చిన గిగ్ వర్కర్ల యూనియన్ (TGPWA)
గోయల్ చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ అసోసియేషన్ (TGPWA) తీవ్రంగా స్పందించింది. సీఈఓ గారు చెబుతున్నవి కేవలం పైపైన లెక్కలని, అసలు వాస్తవాలు భయంకరంగా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.
యూనియన్ వాదన ప్రకారం.. 260 గంటలు కష్టపడితే వచ్చే రూ.21,000 ఆదాయంలో ఎలాంటి సామాజిక భద్రత (Social Security) లేదు. గిగ్ వర్కర్లకు పెయిడ్ లీవ్స్ ఉండవు, యాక్సిడెంట్ కవరేజ్ ఉండదు, కనీసం సరైన ఇన్సూరెన్స్ కూడా ఉండదు. అన్ని ఖర్చులు తీసేస్తే ఒక గిగ్ వర్కర్ నికరంగా గంటకు సంపాదించేది కేవలం రూ.81 మాత్రమేనని వారు లెక్కగట్టారు.
టిప్స్ కథేంటి?
కస్టమర్లు ఇచ్చే టిప్స్ 100% డెలివరీ పార్ట్నర్లకే వెళ్తాయని, ఆ ట్రాన్సాక్షన్ చార్జీలు కూడా కంపెనీయే భరిస్తుందని గోయల్ చెప్పారు. అయితే ఇక్కడే అసలు విషయం బయటపడింది. ఆర్డర్ ఇచ్చే వారిలో కేవలం 5% మంది మాత్రమే టిప్స్ ఇస్తున్నారట. అంటే సగటున గంటకు కేవలం రూ.2.6 మాత్రమే టిప్ రూపంలో వస్తోంది. ఇది చాలా స్వల్పమని, దీనిని సంపాదనలో భాగంగా చూపించడం సరికాదని యూనియన్ వాదిస్తోంది.
10 నిమిషాల డెలివరీపై ఆందోళన
మరోవైపు స్విగ్గీ, జోమాటోలు తీసుకొస్తున్న 10-నిమిషాల డెలివరీ మోడల్‌పై కూడా గిగ్ వర్కర్స్ (Gig workers) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది డెలివరీ పార్ట్ నర్ల ప్రాణాల మీదకు తెస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. అయితే స్టోర్ల సాంద్రత పెంచడం వల్ల ఇది సాధ్యమవుతుందే తప్ప, డెలివరీ పార్ట్నర్లను వేగంగా వెళ్లమని ఒత్తిడి చేయడం లేదని గోయల్ సమర్థించుకున్నారు.
ఏదేమైనా కంపెనీలు చెబుతున్న ఆదాయానికి, కార్మికులు అనుభవిస్తున్న కష్టానికి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. రూ.21,000 సంపాదన సగటు భారతీయుడికి ఎక్కువే అని కొందరు వాదిస్తున్నా.. ఎండలో, వానలో కష్టపడే గిగ్ వర్కర్లకు కనీస భద్రత లేకపోవడం ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. మరి ఈ గిగ్ ఎకానమీలో మార్పులు వస్తాయో లేదో వేచి చూడాలి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications