Deepinder Goyal: రంగంలోకి దిగిన జొమాటో సీఈవో.. డెలివరీ బాయ్‌గా దీపిందర్ గోయల్..
Zomato: దేశీయ ఫుడ్ డెలివరీ స్టార్టప్ కంపెనీ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ఎల్లప్పుడూ తన కస్టమర్లు, ఉద్యోగులతో మమేకమై పనిచేస్తుంటారని తెలిసిందే. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఆయనే అనేకసార్లు రంగంలోకి దిగుతుంటారు.
తాజాగా ఫ్రెండ్‍షిప్ డేను గోయల్ ప్రత్యేకంగా జరుపుకున్నారు. తానే స్వయంగా డెలివరీ బాయ్ రూపంలో తన డెలివరీ భాగస్వాములకు, రెస్టారెంట్ భాగస్వాములకు ఆహారంతో పాటు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లను పంపిణీ చేశారు. ఇది తనకు బెస్ట్ ఆదివారం అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. ఈ క్రమంలో కొన్ని ఫొటోలను కూడా పంచుకున్నారు.

దీపిందర్ గోయల్ పోస్ట్ వైరల్ అయిన వెంటనే, నెటిజన్లు తమ స్పందనలను పంచుకున్నారు. కొంతమంది వినియోగదారులు గోయల్ ఆలోచనను సమర్థించగా, మరికొందరు ఫుడ్‌టెక్ యునికార్న్‌తో అనుబంధించబడిన డెలివరీ భాగస్వాముల పని పరిస్థితుల గురించి ప్రశ్నలు లేవనెత్తారు. మరికొందరైతే ఈ పేరుతో అదనపు రుసుములు వేయెుద్దంటూ చమత్కారంగా రిఫ్లైలు పెట్టారు.
ప్రజలు CEOని కలవాలని ఆశిస్తున్నందున స్విగ్గితో పోల్చితే Zomato ఆర్డర్‌లు పెరిగే అవకాశం ఉందని ఒక వినియోగదారు రాశారు. ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లను బహుమతిగా ఇవ్వడం, డెలివరీ భాగస్వాములకు ఆహారాన్ని డెలివరీ చేయడం కంటే, Zomato CEO వారికి బైక్‌లను బహుమతిగా ఇవ్వడాన్ని పరిగణించాలని మరొక వినియోగదారు చెప్పారు.


Click it and Unblock the Notifications