Zomato Order Scheduling: దేశంలోని ఆహార ప్రియులను ఆశ్చర్యపరిచేందుకు ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటో టెక్నాలజీతో సేవలను మెరుగుపరుస్తూనే ఉంది. ఈ క్రమంలో సరికొత్త ఫీచర్ లాంచ్ చేసింది.
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో కస్టమర్‌లు తమ ఫుడ్ ఆర్డర్‌లను రెండు రోజుల ముందుగానే షెడ్యూల్ చేసుకోవడానికి వీలు కల్పించే సరికొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. తొలుత దీనిని అనేక ప్రధాన భారతీయ నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ ఫీచర్ కంపెనీ ఆఫర్లకు గణనీయమైన మెరుగుదలకు దారితీసిందని తెలుస్తోంది. ఉరుకులు పరుగుల జీవితంలో బిజీగా గడిపే చాలా మంది సమయానికి నచ్చిన ఫుడ్ డెలివరీ పొందటానికి ముందుగానే ఆర్డర్లను ప్లేస్ చేసే ఈ సరికొత్త ఫీచర్ వీలు కల్పించటంపై అనేక మంది వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జొమాటో వ్యవస్థాపకులు, సీఈవో దీపిందర్ గోయల్ కొత్త ఫుడ్ ఆర్డర్ షెడ్యూలింగ్ ఫీచర్ లాంచ్ గురించి ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. కొత్త సౌకర్యం ముందు దిల్లీ NCR, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, చండీగఢ్, లక్నో, జైపూర్‌లోని సుమారు 13,000 రెస్టారెంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అయితే దీనికింద కనీస ఆర్డర్ విలువను రూ.1,000గా జొమాటో నిర్ణయించిందని తెలిపారు. ఈ నగరాల్లోని ఫుడ్ లవర్స్ 2 రోజుల ముందుగానే ఆర్డర్ చేయడం ద్వారా మీ భోజనాన్ని మెరుగ్గా ప్లాన్ చేసువాలని ఆయన సూచించారు. రానున్న కాలంలో ఈ ఫీచర్ ను ఇతర నగరాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు దీపిందర్ వెల్లడించారు. తద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే రెస్టారెంట్ల సంఖ్యతో పాటు నగరాల సంఖ్యను పెంచాలని లక్ష్యంగా జొమాటో ముందుకు సాగుతోంది. అయితే ఈ సౌకర్యం త్వరలోనే హైదరాబాద్ మహానగరంలోని బిర్యానీ ప్రియులకు సైతం అందుబాటులోకి రానున్నట్లు సీఈవో ప్లాన్ పరిశీలిస్తే అర్థం అవుతోంది.
ఇటీవల జొమాటో రెండేళ్ల కిందట ప్రారంభించిన లెజెండ్స్ ఇంటర్‌సిటీ డెలివరీ సేవను నిలిపివేసిన వారంరోజుల్లోపే కొత్తగా ఆర్డర్ షెడ్యూలింగ్ సౌలభ్యాన్ని ఆహార ప్రియులకోసం రోలవుట్ చేయటం గమనార్హం. కొత్త సేవలపై నెటిజన్ల సందేహాలను పరిశీలిస్తే.. స్మితి గుప్తా అనే మహిళ దీపిందర్ పోస్టుపై స్పందిస్తూ "రెస్టారెంట్‌లు ఆర్డర్ సమయంలో సిద్ధం చేసి, డెలివరీ షెడ్యూల్ వరకు వాటిని ఫ్రిజ్‌లో ఉంచి. ఆపై మైక్రోవేవ్ లేదా డిస్పాచ్ చేసే ముందు మళ్లీ వేడి చేస్తే ఏమి చేయాలి?" అంటూ తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో మరో ఖాతాదారుడు స్పందిస్తూ.. "ఆర్డర్ షెడ్యూలింగ్ అంత అవసరమా, ముఖ్యమా? నా ఉద్దేశ్యం ఎవరైనా చిన్న సమావేశాలకు ఆర్డర్ చేయాలనుకుంటున్నారని అనుకుందాం. వారి ఎంపిక, ప్రాధాన్యతలు రెండు రోజుల్లో మారవచ్చు" అని అన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications