Blinkit: జొమాటో కొత్త సేవలు.. ప్రిట్ అవుట్ కావాలా..? నిమిషాల్లో ఇంటివద్దకే..
Blinkit: ఫుడ్ డెలివరీ దిగ్గజంగా ఉన్న జొమాటో తాజాగా మరో నూతన సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. దీని ద్వారా వినియోగదారులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది.

బ్లింకిట్ కొత్త సేవ..
జొమాటో తన కస్టమర్‌లను బ్లింకిట్ కోసం క్రాస్ లెవరేజ్ చేయడంలో ప్రయోగాలు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్లాట్‌ఫారమ్‌పై కొత్త సేవ అందుబాటులోకి వచ్చింది. అదేంటంటే.. జొమాటో యాజమాన్యంలోని Blinkit ఇకపై తన కస్టమర్లకు కేవలం 11 నిమిషాల్లో ఇంటివద్దకే ప్రింట్‌అవుట్‌లను డెలివరీ అందజేయనున్నట్లు గురువారం వెల్లడించింది.

ఇబ్బంది తగ్గించేందుకు..
ఇంట్లో ప్రింటర్ లేకపోవటం, జెరాక్స్ లేదా ప్రిట్ అవుట్ అవసరమైనప్పుడు సైబర్ కేఫ్ లేదా లైబ్రరీ లేదా ఇరుగుపొరుగు వారి నుంచి లేదా ఆఫీస్ పొందడం ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని సార్లు చివరి క్షణాల్లో లేదా సమయం సమీపిస్తున్న సమయంలో ఏదైనా ప్రింట్ అవుట్ అవసరమైనప్పుడు ఇది మరింత గందరగోళానికి కారణమౌతుంది. దీనిని పరిష్కరించేందుకే నయా సేవలను అందిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి జితేష్ గోయెల్ వెల్లడించారు.

అందుబాటు ధరల్లో..
ఈ సేవలు కస్టమర్లకు అందుబాటు ధరల్లో ఉండనున్నట్లు జితేష్ వెల్లడించారు. కస్టమర్లు ప్రింట్ అవుట్ కోసం ఫైల్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని.. తరువాత దానిని నిమిషాల్లో డెలివరీ చేస్తమని వెల్లడించారు. పైగా డెలివరీ తరువాత అప్‌లోడ్ చేసిన ఫైల్‌ను తొలగిస్తామని స్పష్టం చేశారు.

టెక్ ఇంటిగ్రేషన్ కోసం..
రెండు కంపెనీల మధ్య టెక్ ఇంటిగ్రేషన్‌లు రెండు వైపులా పురోగతిని వేగవంతం చేస్తాయని కంపెనీ చెబుతోంది. కంపెనీ అందించిన వివరాల ప్రకారం నష్టాలు ప్రతినెల తగ్గుతున్నాయి. రూ.2,040 కోట్ల నుంచి జూలైలో రూ.929 కోట్లకు తగ్గినట్లు కంపెనీ వెల్లడించింది. బ్లింకిట్ నిరంతర వృద్ధికి పనితీరును పర్యవేక్షిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications