Zivame: మహిళలు లోదుస్తుల విక్రయ మార్కెట్లో గొప్ప అవకాశాన్ని చూశారు రిచా ఖర్, కపిల్ సురేకర్. ఈ క్రమంలో వాటిని ఆన్‌లైన్‌లో విక్రయించాలని నిర్ణయించుకున్నారు.
దీంతో 2011లో వారిద్దరూ ఆన్‌లైన్ లోదుస్తుల ప్లాట్‌ఫారమ్ జీవామ్‌ను ప్రారంభించారు. ఇది మహిళలకు మంచి షాపింగ్ అనుభవాన్ని అందించినప్పటికీ తొలి విజయాన్ని నిలబెట్టుకోలేకపోయింది. అలా 2015-16లో కంపెనీ నష్టాలు పెరిగాయి. ఈ క్రమంలో రిచా ఖాన్ 2017లో కంపెనీ నుంచి తప్పుకున్నారు. అలా చివరికి అనేక మార్పుల తర్వాత లావణ్య పచిసియా కంపెనీ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.

లావణ్య రాకతో కంపెనీ నష్టాలు క్రమంగా తగ్గటం ప్రారంభమయ్యాయి. 2020లో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ దాదాపు రూ.1,300 కోట్లకు జీవామ్ కంపెనీని కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2022-23లో కంపెనీ ఆదాయం 150 శాతం పెంచుకుని లాభదాయకతను నమోదు చేసింది. లావణ్య 6 సంవత్సరాలుగా కంపెనీ సీఈవోగా పనిచేస్తున్నారు. దీనికి ముందు ఆమె నైక్‌లో ఫైనాన్షియల్ కంట్రోలర్‌గా, ఎర్నెస్ట్ & యంగ్ గ్లోబల్ లిమిటెడ్‌లో ఆడిట్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు.
కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన లావణ్య బికామ్ పూర్తి చేశారు. ఆ తర్వాత సీఏ పూర్తిచేసి బిజినెస్ స్ట్రాటజీ, ఫైనాన్స్, మేనేజ్మెంట్, బిజినెస్ ప్లానింగ్ వంటి వివిధ రంగాల్లో 20 ఏళ్ల పాటు పనిచేశారు. కంపెనీ 170కి పైగా రిటైల్ అవుట్‌లెట్‌లను ఏర్పాటుతో గణనీయమైన విస్తరణను నమోదు చేసింది. 70 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు సరైన సైజు లోదుస్తులను ధరించరు. అయితే వీరికి అన్ని పరిమాణాలు, ఆకారాలు, వయస్సుల్లో సౌకర్యవంతమైన లోదుస్తులను అందించేందుకు కంపెనీ వినూత్న సాంకేతికతను కలిగి ఉంది.
మేక్ ఇన్ ఇండియా చొరవతో కంపెనీ ఎక్కువ మంది విక్రేతలతో భారతదేశంలో తయారీకి మారింది. కంపెనీ డిస్కౌంట్ కంటే నిజమైన ధర అనే భావనకు కట్టుబడి ఉంటుంది. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసినా లేదా అవుట్‌లెట్‌లు, మెట్రోలు లేదా నగరాల్లో షాపింగ్ చేసినా అన్ని ఛానెల్‌లలో ధరలు, తగ్గింపులు ఒకే విధంగా ఉంచుతూ ముందుకు సాగుతోంది. అలా లావణ్య పనితీరుతో ఇషా అంబానీ నేతృత్వంలోని zivame లాభాలబాట పట్టింది.


Click it and Unblock the Notifications