Layoff: 20 శాతం ఉద్యోగాల్లో కోత విధించిన ZestMoney.. Phonepeతో డీల్ క్యాన్సిల్ కావడంతో..
Layoff: PhonePe వ్యాపారాభివృద్ధిలో భాగంగా లెండింగ్ ప్లాట్ పారమ్ ZestMoney ని టేకోవర్ చేయాలని ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఇది పూర్తి కాలేదు. ఈ డీల్ మీద భారీ ఆశలు పెట్టుకున్న ZestMoney పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగా మారింది. బిజినెస్ కొనసాగించాలంటే కొన్ని తీవ్ర నిర్ణయాలు తీసుకోక తప్పని స్థితి ఏర్పడింది.
లెండింగ్ ప్లాట్ ఫారమ్ ZestMoney తన వర్క్ ఫోర్స్ లో 20 శాతం మందిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. PhonePeతో డీల్ బెడిసికొట్టిన అనంతరం వ్యాపారం ఒడిదుడుకుల మద్య సాగుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు 100 మంది సిబ్బంది ఉద్యోగాల్లో కోత విధించడానికి సిద్ధమైంది. వివిధ విభాగాల్లో ఇంత మందిని తగ్గించాలని స్టార్టప్ యోచిస్తోంది.

ప్రస్తుతం ZestMoneyలో దాదాపు 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజా తొలగింపుతో వీరి సంఖ్య 350కి చేరనున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు ఓ సమావేశంలో వెల్లడించారు. అయితే కొన్ని మీడియా నివేదికల ప్రకారం, ZestMoney నుంచి 200 మంది ఉద్యోగులను PhonePe రిక్రూట్ చేసుకోవాలని చూస్తోంది. డిజిటల్ రుణాలపై RBI గతేడాది కఠినంగా వ్యవహరించడం BNPL సెగ్మెంట్ ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. కాగా ఇప్పటి లేఆఫ్ నిర్ణయం ఈ పరిశ్రమపై మరింత ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

వాలెట్లు, ప్రీపెయిడ్ కార్డులు వంటి పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPI)లో క్రెడిట్ లైన్‌లను లోడ్ చేయడంపై RBI నిషేధం విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నాన్ బ్యాంకింగ్ సంస్థలు, ఫిన్ టెక్ కంపెనీలు ఆఫర్ చేస్తున్న 'బై నౌ - పే లేటర్' సేవల ద్వారా చేస్తున్న లోడింగ్ పైనా కొరడా ఝళిపించింది. వీటికి తోడు ZestMoneyతో లావాదేవీలో కొన్ని లోపాలు ఉండటంతో డీల్ ముందుకు సాగలేదని PhonePe సహ వ్యవస్థాపకులు, CEO సమీర్ నిగమ్ పేర్కొని దీనికి ముగింపు పలికారు.


Click it and Unblock the Notifications