ZestMoney: పిన్ టెక్ స్టార్టప్ 'జెస్ట్ మనీ' వ్యవస్థాపకులు ముగ్గురూ తమ కార్యనిర్వాహక పదవులకు రాజీనామా చేయడం తెలిసిందే. కొత్త మేనేజ్ మెంట్ టీమ్ కొలువుతీరుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. తన వ్యాపారానికి మద్ధతుగా ప్రస్తుత ఇన్వెస్టర్స్ నుంచి కొత్తగా ఫండింగ్ రౌండ్ ఖరారు చేయాలని చూస్తోంది. అయితే ఎంత మేరకు సమీకరించాలని చూస్తుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
క్వోనా క్యాపిటల్, జిప్, ఒమిడ్యార్ నెట్‌వర్క్ ఇండియా, ఫ్లోరిష్ వీసీ మరియు స్కార్లెట్ డిజిటల్ సహా ప్రస్తుత వాటాదారులు ఫండింగ్ రౌండ్ కు నాయకత్వం వహిస్తారని భావిస్తున్నారు. రాబోయే కొన్ని వారాల్లో ఈ ప్రక్రియ ముగుస్తుందని తెలుస్తోంది. "కొత్తగా సమీకరించనున్న మూలధనం మా వ్యాపార వృద్ధికి తోడ్పడుతుంది. లాభదాయకత వైపు పయనించే మా మార్గానికి ఆర్థికంగా చేయూతనిస్తుంది" అని జెస్ట్ మనీ మీడియా ప్రకటనలో తెలిపింది.

జెస్ట్ మనీకి చెందిన ముగ్గురు వ్యవస్థాపకులు లిజ్జీ చాప్ మన్, ప్రియా శర్మ మరియు ఆశిష్ అనంతరామన్ సోమవారం కంపెనీకి షాక్ ఇచ్చారు. ఆశ్చర్యకరంగా ఒకే రోజు తమ పొజిషన్స్ నుంచి వైదొలిగినట్లు ప్రకటించారు. కొత్త మేనేజ్‌మెంట్ బృందంలో ముగ్గురు అంతర్గత సభ్యులు ఉంటారని సమాచారం. ప్రస్తుతం ఫైనాన్షియల్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ మోహిత్ ఛజెర్, తాజాగా నియమించబడిన చీఫ్ బ్యాంకింగ్ ఆఫీసర్ మందర్ సత్పుటే మరియు జెస్ట్ మనీలో గ్రోత్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన అభిషేక్ శర్మ ఇప్పుడు ఆయా విభాగాలకు నాయకత్వం వహించనున్నారు.
"కంపెనీ సహ వ్యవస్థాపకులు లిజ్జీ చాప్‌మన్, ప్రియా శర్మ మరియు ఆశిష్ అనంతరామన్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నేడు అధికారిక స్పందన వెలువడింది. రానున్న 3 నుంచి 4 నెలల్లో వ్యాపారం సజావుగా నిర్వహించడానికి వారు తమ మద్దతును కొనసాగిస్తారు. అనంతరం కీలక షేర్ హోల్డర్‌లుగా బిజినెస్ చేస్తారు" అని జెస్ట్‌మనీ తన ప్రకటనలో పేర్కొంది.
"వ్యవస్థాపకులుగా మేము ఇప్పటివరకు నిర్మించిన, సాధించిన వాటి గురించి గర్విస్తున్నాము. కంపెనీని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి, కొత్త తరహా నిర్వహణను తీసుకురావడానికి ఇదే సరైన సమయమని విశ్వసించాము. నూతన బృందం కంపెనీని సరైన దిశలో నడిపిస్తుందని, మరింత గొప్ప విజయాన్ని సాధిస్తుందని విశ్వసిస్తున్నాం. నాలుగు నెలల పాటు మా పూర్తి సహకారం వారికి అందిస్తాం" అని చాప్ మన్ వెల్లడించారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications