Zerodha technical glitch: బ్రోకరేజ్ యాప్స్‌లో సాంకేతిక సమస్యలు రావడం సర్వ సాధారణం. అటువంటి సమయాల్లో పెట్టుబడిదారులు నష్టపోతుండటం బాధ కలిగిస్తుంది. అయితే ఏమీ చేయలేక సర్దుకుపోతూ ఉంటారు. సదరు సంస్థలు అటువంటి పరిస్థితి తిరిగి రానివ్వకుండా జాగ్రత్త పడతాయి. కానీ ప్రతిసారి ఇలాగే జరిగితే మాత్రం ఇన్వెస్టర్ల ఆగ్రహానికి బలికాక తప్పదు.
ప్రముఖ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ జెరోధా ఇవాళ మరోసారి పెట్టుబడిదారులకు హ్యాండ్ ఇచ్చింది. సాంకేతిక లోపం కారణంగా ఆర్డర్స్ ప్లేస్‌మెంట్ విషయంలో సమస్య ఏర్పడింది. దీంతో పలువురు ఇన్వెస్టర్లు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. సదరు సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నికల్ గ్లిచ్ పరిష్కరించబడిందని బ్రోకర్ అప్‌డేట్ ఇచ్చినా, తాము నష్టపోయామంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.

'జెరోధా వల్ల 10 లక్షలు నష్టపోయాం. 9.15 ఆర్డర్‌లు గంటన్నర తర్వాత ప్రాసెస్ చేయబడ్డాయి. జెరోధాలో ఏం జరుగుతోంది. ఇది మనం కష్టపడి సంపాదించిన డబ్బు. నేను నా డబ్బును తిరిగి పొందాలనుకుంటున్నాను. ఇందుకుగాను కోర్టును ఆశ్రయిస్తాను' అని ఒక వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేశారు. 'జెరోధా లోపం కారణంగా పలువురు ఇన్వెస్టర్స్ నష్టాలను ఎదుర్కొంటున్నందుకు బాధగా ఉంది. నాకు కూడా ఒక రోజు ఇలాగే జరిగింది. దీంతో సదరు యాప్ వినియోగించడం మానేశాను. మార్కెట్లో ఇప్పుడు అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటికి మారండి' అని మరొక చెప్పుకొచ్చారు.
విజయవంతంగా ప్లేస్ చేయబడిన ఆర్డర్‌ల స్టేటస్ చూసుకునే సమయంలో కొంతమంది వినియోగదారులు సమస్యలను ఎదుర్కొన్నారని జెరోధా అంగీకరించింది. 'ఈ సమస్య ఇప్పుడు పరిష్కరించబడింది. కొత్త ఆర్డర్‌ల స్థితి సక్రమంగా అప్‌డేట్ చేయబడుతోంది. పాత ఆర్డర్‌ల స్టేటస్ సవరించడానికి పని చేస్తున్నాము. అసౌకర్యానికి క్షమాపణలు' అని తన పోస్ట్‌లో పేర్కొంది.
ఈ తరహా సాంకేతిక లోపాలు ఫేస్ చేయడం జెరోధాకు ఇదేమీ కొత్తకాదు. ఈ ఏడాది జూన్‌లో కూడా ఆర్డర్ ప్లేస్‌మెంట్‌కు సంబంధించి టెక్నికల్ సమస్య తలెత్తింది. 2023లోనూ కైట్ యాప్‌లో లాగిన్ చేయడం, ఆర్డర్‌లు మరియు పొజిషన్‌ల ట్రాకింగ్, ఆర్డర్ ప్లేస్‌మెంట్ విషయంలో ఇన్వెస్టర్స్ సమస్యలు ఎదుర్కొన్నారు. కాగా ఇప్పటి వరకు 8 సార్లు ఈ తరహా లోపాలు తలెత్తినట్లు జెరోధా కూడా అంగీకరించడం గమనార్హం.


Click it and Unblock the Notifications