Zerodha News: రాత్రికి రాత్రి సక్సెస్ అనేది వింటానికి ఈజీగా ఉన్నప్పటికీ.. దానిని దీర్ఘకాలంలో నిలబెట్టుకోవటం చాలా కష్టతరమైన పనే. కానీ ఒక చిన్న కాల్ సెంటర్ ఉద్యోగి స్థాయి నుంచి ప్రారంభించిన వ్యక్తి ఇప్పుడు మనందరికీ తెలిసిన వ్యాపారవేత్తగా ఎదిగాడు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థ జెరోధా గురించే. కంపెనీ వ్యవస్థాపకులు నితిన్ కామత్, నిఖిల్ కామత్ గత ఆర్థిక సంవత్సరం ఒక్కొక్కరు రూ.72 కోట్ల చొప్పున రెమ్మూనరేషన్(జీతభత్యాలు) రూపంలో అందుకున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నివేదించింది. ఇదే క్రమంలో నిఖిల్ కామత్ భార్య, హోల్‌టైమ్ డైరెక్టర్ సీమా పటేల్ ఏడాదికి రూ.36 వేతనంగా అందుకున్నారు. అంటే కుటుంబం మెుత్తం ఏడాది వేతనాల రూపంలో రూ.180 కోట్లను పొందారు.

ఇదే క్రమంలో కంపెనీ సీవోవో వేణు మాధవ్ వేతనం రూపంలో రూ.15.4 కోట్లను అందుకున్నారు. నిఖిల్, నితిన్ వేతనాలను పరిశీలిస్తే వారి గ్రాస్ వేతనం రూ.48 కోట్లుగా ఉండగా.. మిగిలిన మెుత్తం స్టాక్ ఆప్షన్లతో పాటు ఇతర చెల్లింపులు ఉన్నాయి. ప్రస్తుత జెరోధా మార్కెట్ క్యాప్ పరిశీలిస్తే రూ.30,000 కోట్లుగా ఉంది. ఇది కంపెనీ వార్షికంగా సంపాదిస్తున్న లాభానికి 10 రెట్లు అధికం.
బెంగళూరుకు చెందిన జెరోధా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో లాభం,ఆదాయంలో 39 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం దేశంలో రెండవ అతిపెద్ద రిటైల్ బ్రోకింగ్ సంస్థగా కొనసాగుతున్న జెరోధా నవంబర్ నాటికి దాదాపు 65 లక్షల యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. FY24లో దాని టాప్‌లైన్, లాభం ఫ్లాట్‌గా ఉండవచ్చనే భయం ఉంది. సెప్టెంబరులో బెంగళూరుకు చెందిన మరొక ఫిన్‌టెక్ స్టార్టప్ Groww యాక్టివ్ ఇన్వెస్టర్ల సంఖ్య పరంగా 6.63 మిలియన్ల మందితో జెరోధాను అధిగమించింది.


Click it and Unblock the Notifications