Zerodha refund: స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం బ్రోకరేజ్ సంస్థల యాప్స్ వినియోగం తప్పనిసరి. వాటి ద్వారానే మార్కెట్లో లావాదేవీలు, ఆర్డర్స్ ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. అయితే అవన్నీ క్లిష్టమైన టెక్నాలజీతో రూపొందించబడినవి కావడంతో లోపాలు తలెత్తడం సర్వసాధారణం. అనుకోని సందర్భాల్లో పెట్టుబడిదారులు ఎంతగానో నష్టపోతుండటం రోజూ వింటూనే ఉన్నాం. ఇటీవల జెరోధా యాప్ లో ఈ తరహా ఇబ్బందులు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రతిసారీ సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల జెరోధా యూజర్ల నుంచి సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీటివల్ల కష్టపడి సంపాదించిన డబ్బు కోల్పోతున్నామని ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించినట్లు ట్రేడింగ్ ప్లాట్ ఫారమ్ ప్రకటించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. యాప్ లో సమస్య తో తాను 10 లక్షల మేర నష్టపోయానని, ఈ వ్యవహారాన్ని కోర్టులో సవాలు చేయబోతున్నట్లు చెప్పి ఓ ఇన్వెస్టర్ షాక్ ఇచ్చాడు.

అయితే వారం తిరిగేసరికి అదే వ్యక్తి జెరోధాకు ఫేవర్ గా తిరిగి పోస్ట్ చేశారు. దీనికి కారణం లేకపోలేదు. సదరు పెట్టుబడిదారు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులపై ట్రేడింగ్ ప్లాట్ ఫారమ్ చర్యలకు దిగింది. సాంకేతిక లోపం వల్ల కాకుండా యాప్ లోని బగ్ కారణంగా తాను 10 లక్షలు కోల్పోయినట్లు రుజువు చేయడంతో తప్పక దిగి రావాల్సి వచ్చింది. కస్టమర్ తో మాట్లాడి జరిగిన పొరపాటున గ్రహించింది. తమ తప్పిదం వల్ల యూజర్ కోల్పోయిన నగదును తిరిగి అతనికి బదిలీ చేసింది.
విషయాన్ని సీరియస్ గా తీసుకుని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించినందుకు ఆ యూజర్ జెరోధాకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ట్రేడింగ్ ప్లాట్ ఫారంపై సోషల్ మీడియా యూజర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో చాలామంది తాము కూడా గతంలో పలుమార్లు నగదు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ జెరోధా మాత్రం తమ తప్పు లేదని, కేవలం క్షమాపణలతో సరిపెట్టిందని ఆరోపించారు. ఎట్టకేలకు అంత పెద్ద మొత్తాన్ని జెరోధా తిరిగి ట్రాన్స్ఫర్ చేయడం పట్ల యూజర్లలో సంస్థపై నమ్మకం మరింత పెరిగినట్లు అయిందని విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications