Zerodha: మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చిన జెరోధా.. ఇక 'కైట్'లో ఆ ఇబ్బందులకు చెక్
Kite new feature: ప్రముఖ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ జెరోధా పట్ల ఇటీవల కస్టమర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తోంది. అయినప్పటికీ గ్రో తర్వాత అత్యధిక యాక్టివ్ కస్టమర్లతో దేశంలో రెండో స్థానంలో కొనసాగుతుండటం విశేషం. ఇందుకు కారణం లేకపోలేదు. ట్రేడింగ్ వేళల్లో కస్టమర్లకు ఎంతగానో ఉపయోగపడే అనేక ఫీచర్లను తన అధికారిక కైట్ యాప్ లో నిక్షిప్తం చేసింది. ఇవే యూజర్లను మరో బ్రోకర్ వైపు కన్నెత్తి చూడకుండా ఆపేస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు.
తాజాగా మరో కొత్త ఫీచర్‌ను కస్టమర్లకు పరిచయం చేస్తున్నట్లు జెరోధా ప్రకటించింది. 'ప్రైవసీ మోడ్' పేరిట దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. దీంతో యూజర్లు ఓవర్ ట్రేడింగ్ సహా పలు డిస్ట్రక్షన్లను ఈజీగా మరియు సమర్థవంతంగా నిర్వహించవచ్చని చెబుతోంది. ఇప్పటికే 'కిల్ స్విచ్', 'వర్చువల్ కాంట్రాక్ట్ నోట్' వంటి కస్టమర్లు మెచ్చిన ఫీచర్లను కైట్ అందిస్తోంది. వాటికి అదనంగా ఇప్పుడు ప్రైవసీ మోడ్ కూడా వచ్చి చేరింది.

ప్రైవసీ మోడ్ ద్వారా రియల్ టైం ప్రాఫిట్ అండ్ లాస్ ను హైడ్ చేయవచ్చు. ఈ సౌకర్యం కల్పించడంతో యూజర్లు తమ డే టు డే ట్రేడింగ్ లో ఏర్పడే అవాంతరాలను పక్కనపెట్టి ట్రేడింగ్ స్ట్రాటజీపై ఫోకస్ చేసే అవకాశం లభిస్తుందని జెరోధా వెల్లడించింది. దీంతోపాటు స్క్రీన్ షేర్ చేసి తమ అకౌంటులను వేరొకరికి చూపించే సమయంలో సెన్సిటివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎదుటివారికి కనిపించకుండా ఈ ఫీచర్ ద్వారా హైడ్ చేయవచ్చు అని తెలిపింది. చాలా తేలికగా యూజర్ ID మీద క్లిక్ చేసి ప్రైవసీ మోడ్ టాగుల్ బటన్ నొక్కి దీన్ని యాక్టివేట్ చేయవచ్చు.
ఇప్పటికే అందుబాటులో ఉన్న కిల్ స్విచ్ మరియు వర్చువల్ కాంట్రాక్ట్ నోట్ కూడా యూజర్ల మద్దతు పొందాయి. ఓవర్ ట్రేడింగ్ కంట్రోలింగ్ తో పాటు ట్రేడింగ్ సమయంలో కొంత సమయం బ్రేక్ తీసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. దీనిని వినియోగించి ఒక సెగ్మెంట్ ని టెంపరరీగా బ్లాక్ చేయవచ్చు. అయితే తిరిగి 12 గంటల తర్వాత మాత్రమే దాన్ని తిరిగి యాక్టివేట్ చేయడం కుదురుతుంది. ఇక వర్చువల్ కాంట్రాక్ట్ నోట్ ద్వారా ఒక రోజులో ట్రేడ్ చేస్తున్న మొత్తం విలువపై విధించదగిన ఛార్జీల పూర్తి సమాచారాన్ని లైవ్‌లో చూడవచ్చు. తద్వారా ఇతర ట్రేడ్‌లను సమర్థవంతంగా నిర్వహించే అవకాశం లభిస్తుంది.


Click it and Unblock the Notifications