Crypto Crash: కరోనా తరువాతి నుంచి దేశంలో క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య చాలా వరకు పెరిగింది. వీరిలో చాలా మంది కొత్తగా ఇన్వెస్ట్ చేయటం ప్రారంభించినవారే. క్రిప్టోల్లో పెట్టుబడులు చాలా రిస్క్ తో కూడుకున్నవి. వీటి నియంత్రణకు ఎలాంటి చట్టాలు కూడా లేవు. ఈ తరుణంలో వీటిని నియంత్రించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఫిబ్రవరిలో క్రిప్టో ఆస్తులపై పన్నుల ప్రకటన చేసింది. ఈ నిర్ణయం వల్ల దేశంలోని క్రిప్టో పెట్టుబడిదారులు అదృష్టవంతులయ్యారని జెరోదా వ్యవస్థాపకుడు, CEO నితిన్ కామత్ అన్నారు. అసలు ఆయన ఎందుకిలా అన్నారు, దాని ఆంతర్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం:
కేంద్ర ప్రభుత్వ ప్రకటన వల్ల భారతీయ ఇన్వెస్టర్లు క్రిప్టో మార్కెట్లలో భాగస్వామ్యం(participation) గణనీయంగా తగ్గిందని కామత్ తెలిపారు.
వారు పెట్టుబడులను కొనసాగించినట్లయితే.. ప్రస్తుతం కొనసాగుతున్న క్రిప్టో క్రాష్‌లో భారీ నష్టాలను చూడాల్సివచ్చేదని జెరోదా సీఈవో అన్నారు. చాలా మంది నష్టపోకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయం నష్టాలను నివారించడానికి పరోక్షంగా సహాయపడిందని అన్నారు. గతంలో కూడా వీటిలో డబ్బు పెట్టి సర్వం కోల్పోయిన వారు, ఆత్మహత్యలు చేసుకున్న వారి గురించి పలు మార్లు మనం వార్తల్లో విన్నాం.

బేర్ మార్కెట్ కు సిద్ధంగా ఉండాలా..?
ప్రభుత్వ ప్రకటన క్రిప్టో మార్కెట్‌లలో పెట్టుడులు పెట్టేవారిని తగ్గించకుంటే.. వారు అనుకోకుండా "బైయింగ్ ఇన్ ది డిప్"లతు ఆకర్షితులై ఉండేవారని కామత్ అభిప్రాయపడ్డారు. కామత్ ప్రకటనపై ట్విట్టర్ వినియోగదారు స్పందిస్తూ, "ఈక్విటీ ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతోంది... ఇతర అసెట్ క్లాస్‌తో పోలిస్తే ఈ ఏడాది ఈక్విటీ మరింత పడిపోతుంది. దీర్ఘకాల బేర్ మార్కెట్ కోసం సిద్ధంగా ఉండండి." అంటూ వారు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కామత్ గతంలోనే మే మాసంలో మార్కెట్లకు దూరంగా ఉండటం ఇన్వెస్టర్లకు శ్రేయస్కరం అని హెచ్చరించిన విషయం ఈ సందర్భంగా మనం గుర్తుచేసుకోవాలి.

మరో క్రిప్టో క్రాష్ ఉంటుందా..?
తాజాగా US ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ క్రిప్టో ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టవద్దని అవి "చాలా ప్రమాదకరం" అని అమెరికన్లను హెచ్చరించారు. పదవీ విరమణ కోసం పొదుపు చేసే చాలా మందికి తాను సిఫార్సు చేసే విషయం కాదని...తన దృష్టిలో క్రిప్టోలు చాలా ప్రమాదకర పెట్టుబడి ఎసట్ క్లాస్ అని ఆమె అన్నారు. బిట్‌కాయిన్, ఎథెరియం సహా ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీలు నిన్న బాగా పడిపోయిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు ఇప్పటికే సమస్యాత్మకంగా ఉన్న తరుణంలో.. మరొక క్రిప్టో క్రాష్ సంభవించవచ్చని అందరిలోనూ భయాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications