Zerodha News: దేశీయ స్టాక్ మార్కెట్లలో చాలా మందికి తెలిసిన ఉపయోగించే బ్రోకరేజ్ యాప్ జెరోధా. షేర్లు అమ్మినా లేక కొన్నా కేవలం రూ.20 చెల్లిస్తే చాలంటూ డిస్కౌంటెడ్ బ్రోకరేజ్ సేవలను ఆయన పరిచయం చేశారు. తక్కువ ఖర్చులో ట్రేడింగ్ చేసేందుకు అనుమతించటం దేశీయ స్టాక్ మార్కెట్లలో అనేక మంది పెట్టుబడిదారులను ఒక్కసారిగా ఆకర్షించింది.
జెరోధాను ప్రారంభించింది కామత్ సోదరులు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కంపెనీ సీఈవో నితిన్ కామత్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ లో చేసిన కీలక కామెంట్స్ గురించే. నితిన్ కామత్ ఈ క్రమంలో ఒక్కసారిగా తన పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ఆయన కాల్ సెంటర్లో పనిచేస్తున్న రోజులకు సంబంధించిన ఫొటో ఒకటి షేర్ చేశారు. అందులో తన సహాద్యోగులతో కలిసి ఆఫీసులో దిగిన ఒక చిత్రం కనిపించింది. కంపెనీ ప్రారంభానికి ముందు టెలిమార్కెటింగ్ ఉద్యోగం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టెలిమార్కెటింగ్ కాల్స్ వస్తున్నందున తన ఫోన్ నిరుపయోగంగా మారిందని తెలిపారు. కర్మ తిరిగి రావటం అంటే ఇదేనేమో అంటూ తన పోస్టులో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాను నాలుగేళ్లు కాల్ సెంటర్లో గడిపానని కామత్ పేర్కొన్నారు. ఆ సమయంలో ఎక్కువగా అమెరికాలోని వ్యక్తులకు మార్కెటింగ్ కాల్స్ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు తనకు సైతం ఇదే సమస్య ఎదురుకావటంతో నిత్యం ఫోన్ సైలెంట్లో ఉంచుతున్నట్లు స్పష్టం చేశారు. నితిన్ కామత్ చేసిన తాజా కామెంట్స్ సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యాయి.
దీనిపై ఒక యూజర్ స్పందిస్తూ సాధారణంగా ప్రతి 10 కాల్స్‌లో 9 టెలీమార్కెటింగ్ వ్యక్తుల నుంచే వస్తున్నాయన్నారు. రానున్న కాలంలో ఫోన్ కాల్స్ మాయమవుతాయని.. ఇంటర్నెట్ డేటా వినియోగం విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. మరో యూజర్ మాట్లాడుతూ టెలికాం కంపెనీలు అందించే డునాట్ డిస్టబ్ సర్వీసులు పనిచేయటం లేదన్నారు. ప్రస్తుతం కాలంలో ఎన్జీవో సంస్థలు సైతం ఎక్కువగా ఫోన్ కాల్స్ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇదే క్రమంలో సమస్యకు ఒక వ్యక్తి పరిష్కారం అందిస్తూ.. ట్రూకాలర్ యాప్ లో అందించే అలవ్ కాల్స్ ఫ్రమ్ కాంటాక్స్ ఓన్లీ ఆప్షన్ ఎంచుకోవటం వల్ల అనవసరమైన కాల్స్ నుంచి విముక్తి పొందొచ్చని చెప్పారు. అలాగే తాను ఈ సేవలను గడచిన రెండు సంవత్సరాలుగా వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎల్లప్పుడూ ఆరోగ్యం వ్యాయామం గురించి మాట్లాడే 44 ఏళ్ల నితిక్ కామత్ రెండు నెలల కిందట స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన దాని నించి కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే కామత్ ఇటీవలే మెుదటిసారిగా బహిరంగంగా కనిపించారు. జీరో1 ఫెస్ట్‌లో పాల్గొన్నారు. తాను నెమ్మదిగా కోలుకుంటూ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు వెల్లడించారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications