జున్‌జున్‌వాలా కంపెనీపై జెరోధా పందెం.. భారీ పెట్టుబడి వ్యూహం.. స్టాక్ మీ దగ్గర ఉందా..??
Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్ ప్రపంచంలో అనేక మంది పెట్టుబడిదారులను ప్రభావితం చేసిన వ్యక్తి రాకేష్ జున్‌జున్‌వాలా. అందుకే ఆయన బిగ్‌బుల్‌గా మంచి గుర్తింపును పొంది.. లక్షల మంది పెట్టుబడిదారులకు మార్గదర్శిగా నిలిచారు.
గేమింగ్ కంపెనీ నజారా టెక్నాలజీస్ షేర్లు సోమవారం భారీగా పెరిగాయి. బీఎస్ఈలో కంపెనీ షేర్లు 10 శాతానికి పైగా లాభపడి రూ.839.15కి చేరుకున్నాయి. నజారా టెక్నాలజీస్ షేర్ల రేట్ల పెరుగుదల వెనుక ఒక ఆసక్తికరమైన వార్త ఉంది. ప్రముఖ దేశీయ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకులు నిఖిల్, నితిన్ కామత్ నజారా టెక్నాలజీస్‌లో తమ పెట్టుబడి వాటాను పెంచుకుంటున్నారు. గేమింగ్ కంపెనీలో జున్‌జున్‌వాలా కుటుంబానికి దాదాపు 9.96% వాటా ఉంది.

కొత్తగా నజారా కంపెనీలో నిఖిల్, నితిన్ సోదరులు రూ.100 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. దీనికి సంబంధించి ఒక్కో షేరును రూ.714 చొప్పున మెుత్తం 1400560 షేర్లను జారీ చేసేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలినట్లు నజారా టెక్నాలజీస్ సెప్టెంబర్ 4న ప్రకటించింది. అయితే ఈ షేర్లు కామత్ అసోసియేట్స్ అండ్ ఎన్‌కెస్క్వేర్‌లకు జారీ చేయబడతాయి.
జెరోధా వ్యవస్థాపకులు కొనుగోలు చేసిన షేర్లకు 6 నెలల లాక్-ఇన్ పీరియడ్ ఉంది. అంటే ఈ కాలంలో వారు తాము కొనుగోలు చేసిన వాటాలను విక్రయించటానికి కుదరదు. కామత్ ఇప్పటికే నజారా టెక్నాలజీస్‌లో దాదాపు 1% వాటాను కలిగి ఉన్నారు. తాజాగా చేసిన పెట్టుబడితో కంపెనీలో వీరి పెట్టుబడి 3.5 శాతానికి పెరిగనుంది. గడచిన ఆరు నెలల కాలంలో నజారా టెక్నాలజీస్ కంపెనీ షేర్లు మార్కెట్లో 59 శాతం మేర ర్యాలీని నమోదు చేశాయి. మార్చి 6, 2023న BSEలో రూ.528.45 వద్ద ఉన్న స్టాక్ ప్రస్తుతం రూ.893గా ఉంది.


Click it and Unblock the Notifications