Zerodha News: నెట్టింట నితిన్ కామత్ పోస్ట్ వైరల్.. నాలుగేళ్లలో జెరోధా ఎంత సంపాదించిందంటే..
Nithin Kamath: కరోనా అనంతరం పలు కంపెనీలు మూతపడ్డాయి. ఉపాధి కరువై జనం కొట్టుమిట్టాడారు. ఆ సమయంలో స్టాక్ మార్కెట్లు చాలామందికి భరోసా ఇచ్చాయి. అప్పటివరకు షేర్స్ అంటే ఏంటో కూడా తెలియని చాలామంది ఫైనాన్షియల్ మార్కెట్ల గురించి తెలుసుకుని పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. తద్వారా కొంతమంది లాభాలను కూడా ఆర్జించారు. అయితే ఇది కాస్త బ్రోకరేజ్ సంస్థలకు వరంగా మారింది.
జెరోధా సహ వ్యవస్థాపకులు నితిన్ కామత్ X వేదికగా ఓ పోస్ట్ చేశారు. తమ సంస్థ ద్వారా ఇన్వెస్టర్స్ కోట్లాది రూపాయల మేర లాభాలు పొందినట్లు అందులో ప్రకటించారు. గత నాలుగు సంవత్సరాలలో జెరోధా ద్వారా పొందిన లాభాలను గణాంకాలతో సహా ప్రకటించారు. దాదాపు 50 వేల కోట్లను ముదుపరులు లాభాలుగా స్వీకరించినట్లు వెల్లడించారు. ఇది తమకు గర్వకారణమని చెప్పుకొచ్చారు.

ఇక తమ సంస్థ 4 లక్షల 50 వేల కోట్ల పెట్టుబడులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో పెద్ద మొత్తం గత నాలుగేళ్లలోనే ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. వాటికి సంబంధించి మరో లక్ష కోట్ల మేర పెట్టుబడిదారులు లాభాలు గడించినట్లు వివరించారు. అయితే మదుపరులు వీటిని ఇంకా స్వీకరించలేదని స్పష్టం చేశారు. ఇంత భారీ మొత్తంలో సంపద సృష్టించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
నితిన్ కామత్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన పోస్టుపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ జనరేషన్ గోల్డ్ మరియు రియల్ ఎస్టేట్ నుంచి స్టాక్ మార్కెట్ వైపు షిఫ్ట్ అవుతుందని కొందరు కామెంట్స్ చేశారు. కాగా మరికొందరు మరికొందరు లాభాలను పోస్ట్ చేశారు సరే మరి నష్టాలు మాటేమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications