Investment: స్టార్ మార్కెట్లలోకి అందరూ వచ్చేది లాభాలను పొందటానికే. కానీ అది మనం ఊహించుకున్నంత సులువైనది కాదని అనుభవపూర్వకంగా చాలా మంది నష్టపోయిన వారికి తెలుసు. అది గ్యాంబ్లింగ్ అనే వారు ఉన్నప్పటికీ.. నిలవాలంటే ఎల్లప్పుడూ మార్పులకు అనుగుణంగా కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలి.
అయితే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు అవసరమైన విలువైన చిట్కాకలను ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ వెల్లడిస్తుంటారు. తాజాగా పోడ్‌కాస్ట్ సిరీస్ రెండవ ఎపిసోడ్‌లో.. స్టాక్ మార్కెట్ పెట్టుబడి, సోషల్ మీడియా, బిల్ గేట్స్‌తో తన సమావేశం సహా పలు అంశాలపై మాట్లాడారు.

ట్రేడింగ్ కోసం ఇన్వెస్టర్లు మార్కెట్లోకి వచ్చినప్పుడు ముందుగా వారు నాలుగైదు తప్పులను చేస్తుంటారని పేర్కొన్నారు. అలాంటి తప్పులు చేయటం వల్ల డబ్బును కోల్పోయే అవకాశాలు పెరుగుతూ పోతాయని అన్నారు. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్లు మంచి రిటర్న్స్ పొందగలిగే కొన్ని 'సరళమైన' మార్గాల గురించి మాట్లాడారు. కొత్త వారు ముందుగా నిఫ్టీ 50 లేదా ఏవైనా ఐదు లార్జ్ క్యాప్ షేర్లను కొనుగోలు చేయటం చాలా సులువైన ఎంపిక అన్నారు. ఇలా గడచిన 30-40 ఏళ్ల మధ్య పెట్టుబడి పెట్టి వాటిని ముట్టుకోకుండా ఉంటే ఊహించని లాభాలను పొంది ఉండేవారని తెలిపారు.
టాక్స్ విషయానికి సంబంధించి పెద్ద సీక్రెట్ చెబుతూ.. ఎవరైనా రిటైల్ ఇన్వెస్టర్ సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించినట్లయితే దానిలో వచ్చే లాభాలకు 30-40 శాతం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీర్ఘకాలం స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయంపై 10 శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ చెల్లిస్తే సరిపోతుందనే విషయాన్ని ప్రస్తావించారు. అయితే వ్యాపారంలోనైనా, మార్కెట్లలోనైనా ఒడిదొడుకులు తప్పవని కామత్ అన్నారు.
అయితే పెట్టుబడులపై ప్రజలకు అవగాహన కల్పించి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడాల్సిన బాధ్యత జెరోధా వంటి మధ్యవర్తులపై ఉందంటూ కామత్ ముగించారు. అయితే ఈ ఎపిసోడ్‌లో వర్సే సహవ్యవస్థాపకులు ఉమంగ్ బేడి, కూ సీఈవో అప్రమేయ రాధాకృష్ణ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తన్మయ్ భట్ పాల్గొన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications