Nikhil Kamath: చదువు మధ్యలోనే మానేశాడు.. వాడు ఏం చేస్తాడని అనుకున్నారు.. కానీ..
నెలకు రూ.8 వేలతో జీవితాన్ని మొదలు పెట్టిన వ్యక్తి ఇప్పుడు బిలియనీర్ అయ్యాడు. అతనే నిఖిల్ కామత్. నిఖిల్ 17 ఏళ్ల కాల్ సెంటర్ లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు.వచ్చే రూ.8వేల జీతంలో కొంత డబ్బుతో స్టాక్‌లలో ట్రేడింగ్ ప్రారంభించాడు. మొదట్లో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి లైట్ తీసుకున్నాడు. కానీ సంవత్సరం తర్వాత సీరియస్‌గా తీసుకున్నాడు. కామత్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత విజయవంతమైన స్టాక్ బ్రోకరేజ్ సంస్థకు నాయకత్వం వహిస్తున్నాడు.

తండ్రి ఇచ్చిన డబ్బుతో
హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి తన ప్రయాణం, తండ్రి తన పొదుపులో కొంత భాగం ఇవ్వడంపై జెరోధా సహ-వ్యవస్థాపకులు కామత్ మాట్లాడారు. తన తండ్రి పొదుపు చేసిన కొంత భాగం తనకు ఇచ్చాడని ఆ డబ్బుతోనే ట్రైడింగ్ మొదలు పెట్టినట్లు నిఖిల్ కామత్ వివరించారు. ఆ తర్వాత, కాల్ సెంటర్‌లోని తన మేనేజర్ కొంత డబ్బు ఇచ్చి ట్రేడింగ్ చేయమని కోరాడు.

2010లో జెరోధా
ట్రేడింగ్ చేయడంతో డబ్బు వచ్చింది. ఈ విషయం కొందరికి తెలిసి వారు తమకు తరఫున ట్రేడింగ్ చేయాలని కోరారు. వారి డబ్బుతో స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టి లాభాలు తెచ్చాడు. దీంతో ఉద్యోగం మానేసి ట్రేడింగ్ చేయాలని నిర్ణయించుకున్నానని కామత్ చెప్పాడు. "తర్వాత నేను మా సోదరుడితో కలిసి కామత్ అసోసియేట్స్‌ను ప్రారంభించామని, 2010లో మేము జెరోధాను ప్రారంభించాము!" నిఖిల్ కామత్ పేర్కొన్నాడు.

వారు నాపై నమ్మకం ఉంచారు
చదువు మానేసి తనకు డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఉందన్నాడు. ఎందుకంటే తను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని వివరించాడు. అలాగే తన కజిన్స్ ఎంబీఏ పూర్తి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. దీంతో తను ఏం చేస్తావని చాలా మంది ప్రశ్నించారని వివరించాడు. అయితే తన తల్లిదండ్రులకు తనపై నమ్మకం ఉంచారని గుర్తు చేసుకున్నాడు.

పట్టుదలతో పని చేస్తే..
"స్కూల్ డ్రాపౌట్ నుంచి, కాల్ సెంటర్‌లో పని చేయడం, జెరోధా, ట్రూ బెకన్ వరకు తను రెండు-మూడు విషయాలను గుర్తించానని నిఖిల్ కామత్ చెప్పారు. పని చేయడం వల్లే ఈ స్థాయికి వచ్చానని, తను ఇప్పటికి ఓపిక ఉన్నంత వరకు పని చేస్తానని పేర్కొన్నారు. నా ఏకైక సూచన ఏమిటంటే.. ప్రస్తుత అవరోధాల గురించి పట్టించుకోవద్దు. ఈ రోజు చేసే పని ఈ రోజే చేయండి. పట్టుదలతో ముందుకెళ్తే విజయం సాధిస్తారని కామత్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications