Zerodha CEO: భారీ స్థాయిలో దూసుకుపోతున్న వాటిలో వైద్య ఖర్చులు టాప్ లెవెల్ లో ఉన్నాయి. అందుకే ప్రభుత్వం చిన్నపాటి ఉద్యోగాలు మొదలుకొని అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందించే విధంగా నిబంధనలు తీసుకొచ్చింది. ఉద్యోగుల జీతభత్యాలు ఆధారంగా ESI లేదా హెల్త్ కార్డు ద్వారా ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తోంది. అయితే సాధారణ పౌరులు మాత్రం నాణ్యమైన వైద్య సేవలకు ఆమడ దూరంలో ఉంటున్నారు. దీనిపై ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం అవుతుంది.
జెరోధా CEO నితిన్ కామత్ ఇదే విషయంపై మాట్లాడారు. సమగ్ర ఆరోగ్య బీమా ఆవశ్యకతను నొక్కి చెబుతూ Xలో పోస్ట్ చేశారు. కేవలం ఒక్క ఆరోగ్య సమస్య ప్రజలను దివాళా అంచుకు తీసుకెళ్లే ఆస్కారం ఉందన్నారు. ఈ తరహా పరిస్థితుల నుంచి బయటపడాలంటే 80 నుంచి 90 శాతం క్లైమ్ సెటిల్మెంట్ రేషియో కలిగి, సుమారు 10 ఏళ్ల బ్యాక్ ట్రాక్ కలిగిన సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలని సూచించారు. 5 వేల నుంచి 8 వేల నెట్వర్క్ ఆసుపత్రులు ఉండేలా చూసుకోవాలన్నారు.

'హెల్త్ రిపోర్ట్ ఆఫ్ కార్పొరేట్ ఇండియా 2023' పేరిట ఫ్లమ్ ఇటీవల ఓ నివేదిక రిలీజ్ చేసింది. ఆసియాలో ఏటా 14 శాతం అత్యధిక వైద్య ద్రవ్యోల్బణ రేటు కలిగిన దేశంగా భారత్ నిలిచిందని అందులో పేర్కొంది. ఇది ఉద్యోగులపై గణనీయమైన ఆర్థిక ఒత్తిడికి కారణమవుతుందని వెల్లడించింది. 71 శాతం మంది కార్మికులు తమ వైద్య ఖర్చుల కోసం సొంత డబ్బుని వెచ్చిస్తున్నట్లు చెప్పింది. కేవలం 15 శాతం మాత్రమే తమ కంపెనీ ద్వారా బీమా సంస్థ నుంచి కవరేజ్ అందుకుంటున్నట్లు తెలిపింది.
ఇందుకు అదనంగా కేవలం 12 శాతం కంపెనీలు మాత్రమే టెలీ హెల్త్ ఫెసిలిటీని అందిస్తున్నాయి. ఇక 1 శాతం కంటే తక్కువ సంస్థలు ఔట్ పేషెంట్ బెనిఫిట్ కల్పిస్తున్నాయి. కాబట్టి సమగ్ర ఆరోగ్య మద్దతు లేకపోవడంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో 85 శాతం మందికి యజమానుల నుంచి ఏమాత్రం సాయం అందడం లేదు. 'ఒక వ్యక్తి సగటున 90 వేల గంటలు పని చేస్తున్నాడు. ఇది దాదాపు తన జీవితంలో మూడవ వంతు. కేవలం మానవతా దృక్పథంతో కాకపోయినా, శ్రామిక శక్తిపై పెట్టుబడిగా భావించి ఆయా సంస్థలు సిబ్బంది ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి' అని ప్లమ్ CTO సౌరభ్ అరోరా సూచించారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications