దేశంలో ఇప్పుడు క్విక్ కామర్స్ యాప్‌ల వాడకం పెరుగుతోంది. జెప్టో, ఇన్‌స్టామార్ట్, బ్లింగిట్ వంటి యాప్‌ల ద్వారా కస్టమర్లు కిరాణా సామాగ్రి నుండి ప్రతిదీ ఆర్డర్ చేసి 10 నిమిషాల్లో డెలివరీ చేస్తున్నారు. అయితే ఈ కంపెనీలు ఆరంభంలో వివిధ డిస్కౌంట్లతో సేవలను అందించాయి. అయితే రాను రాను డెలివరీ ఫీజులు, ప్లాట్‌ఫామ్ ఫీజులు మొదలైన వాటిని వసూలు చేయడం ప్రారంభించాయి. ఈ పరిస్థితిలో, జెప్టోలో కొత్త రకం రుసుము వసూలు చేయడం వినియోగదారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతి ద్వారా వినియెగదారులు ఆర్డర్ చేసినప్పుడు, క్యాష్ హ్యాండ్లింగ్ ఫీజుగా ప్రత్యేక చెల్లింపు వసూలు చేయబడుతుందని జెప్టో రసీదు ద్వారా తెలుస్తోంది.ఓ కస్టమర్ తన X పేజీలో ఈ వివరాలను ఒక ఫోటోతో సహా పోస్ట్ చేశాడు. బెంగళూరుకు చెందిన మార్కెటింగ్ ప్రొఫెషనల్ సుముఖ్ రావు తన స్నేహితురాలు జెప్టోలో వస్తువులను ఆర్డర్ చేస్తున్నప్పుడు సమస్యను ఎదుర్కునట్లు తెలిపారు. Zepto యాప్‌లో ఆర్డర్ చేసేటప్పుడు UPI ద్వారా చెల్లించాలని ప్రయత్నించినప్పటికీ ఆ ఆర్డర్ డిఫాల్ట్‌గా COD (Cash On Delivery) ఆప్షన్‌కి వెళుతోంది. అంతేకాకుండా, ప్రతి COD ఆర్డర్‌కు రూ.15 + GST నగదు నిర్వహణ రుసుము చెల్లించాలని చెబుతుంది. దీన్ని ఆయన గమనించారు.

ఈ ఛార్జ్ వినియోగదారుడు ఆర్డర్ బటన్‌ను నొక్కిన తర్వాత మాత్రమే తాత్కాలికంగా (సెకన్లలో కనిపించి మాయమయ్యేలా) చూపించబడుతుంది. అంటే చెల్లించే ముందు తుది బిల్లులో ఇది చూపించదు. ఇది పూర్తిగా డార్క్ ప్యాటర్న్ అనే UX మోసానికి శ్రేణిలోకి వస్తుందని మండిపడ్డారు. ఇది వినియోగదారుల నిర్ణయాన్ని తప్పుదారి పట్టించేందుకు డిజైన్ చేయబడ్డ UI అని విమర్శించారు.
సాధారణంగా కస్టమర్ లాభసాటిగా ఉన్నప్పుడు COD ఛార్జ్‌ను అమలు చేయడం సాదారణంగా ఫిజికల్ షిప్పింగ్‌లో న్యాయంగా భావిస్తారు. ఎందుకంటే రిటర్న్స్, రద్దులు ఎక్కువగా ఉంటాయి. కానీ Zepto వంటి క్విక్-కామర్స్ ప్లాట్‌ఫాంలు ఈ ఛార్జ్‌ను డిజిటల్ డెలివరీ అప్లికేషన్ ద్వారా వసూలు చేయడంపై అనేకమంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
జెప్టో తెలివిగా పే ఆన్‌లైన్, పే క్యాష్/UPI ఆన్ డెలివరీ బటన్‌లను మార్చి కస్టమర్ డబ్బును దొంగిలిస్తున్నట్లు తేలిందని మండిపడుతున్నారు. మనం పొరపాటున పే క్యాష్/UPI ఆన్ డెలివరీపై క్లిక్ చేస్తే, పే ఆన్ డెలివరీకి వారు విడిగా క్యాష్ హ్యాండ్లింగ్ ఫీజు వసూలు చేస్తారని అయితే మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు అది చూపబడదని మరొక నెటిజన్ తెలిపారు.

ఆన్‌లైన్‌లో కాకుండా క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా చెల్లించే ఆర్డర్‌లకు వారు రూ.25 క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీని కూడా వసూలు చేస్తున్నారు. మేము ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఈ విషయాన్ని వివరంగా ప్రస్తావించకపోవడంపై ఘాటుగానే మండిపడుతున్నారు. జెప్టో కంపెనీ వినియోగదారులకు తెలియకుండానే ఇలాంటి అనేక రుసుములను వసూలు చేస్తోందని మండిపడుతున్నారు.
ఇది మోసం మాత్రమే కాదు. ఇది కస్టమర్ నమ్మకాన్ని దెబ్బతీసే అసహ్యకరమైన వ్యాపార పద్ధతి. మీరు ఏ పేమెంట్ మోడ్‌ను ఎంచుకుంటున్నారో స్పష్టంగా తెలియజెయ్యకుండా, దానికి ఛార్జ్ వసూలు చేయడం అనైతికమని మరొక నెటిజన్ మండిపడ్డారు. నా ఇన్‌వాయిస్ చూసే సరికి నా అకౌంట్ నుండి అదనంగా రూ.25 పోయాయి. నేను ఎప్పుడూ COD ఎంచుకోలేదని ఓ నెటిజన్ అన్నారు. మీరు కూడా Zepto లేదా ఇతర క్విక్-కామర్స్ యాప్స్‌ను వాడేటప్పుడు మీ చివరి ఇన్‌వాయిస్‌ను జాగ్రత్తగా పరిశీలించండి. మీరు ఎంత చెల్లించారో తెలుసుకోవడం కంటే ఎందుకు చెల్లించారో తెలుసుకోవడం చాలా ముఖ్యమని పలువురు సలహాలు ఇస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications