Quick commerce: భారతదేశంలో క్విక్ కామర్స్ రంగం వేగంగా వృద్ధిని సాధిస్తోంది. ఒకప్పుడు ఇంట్లోని వాళ్లు షాపుకు వెళ్లి కావాల్సినవి తెస్తే కొనుక్కోవటానికి కొంత మెుత్తం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు క్విక్ కామర్స్ కంపెనీలు అచ్చం అలాంటి పనే చేస్తున్నాయి. ఇంట్లో కూర్చుని కావాల్సిన వస్తువులను యాప్ ద్వారా ఆర్డర్ పెడితే 15 నిమిషాల్లోనే ఈ కంపెనీలు ఇంటికి డెలివరీ చేస్తున్నాయి.
వాస్తవానికి భారతీయ క్విక్ కామర్స్ రంగంలో జెప్టో, స్విగ్గీ ఇన్స్టామార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి పెద్ద ఆటగాళ్లు నడిపిస్తున్నారు. అయితే జెప్టో మాత్రం మార్కెట్లో ప్రత్యర్థులకు ఒక్క అడుగు ముందుగానే ఉండేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకొస్తోంది. తాజాగా కంపెనీ నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్, టాబ్లెట్స్, మిక్సీలు వంటి అనేక ఉత్పత్తులను నిమిషాల్లో అమ్మేస్తున్న సంగతి తెలిసిందే. అక్షయతృతీయ వంటి ప్రత్యేక సందర్భాల్లో గోల్డ్, సిల్వర్ కాయిన్స్ కూడా విక్రయిస్తోంది.

అయితే తాజాగా జెప్టో తన యాప్ ద్వారా యూజర్లు స్కోడా కార్లను కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. జెప్టో వీటిని స్వయంగా ఆర్డర్ చేసిన వారికి డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికోసం ఇప్పటికే స్కోడా ఇండియాతో జతకట్టినట్లు ఒక వీడియోను సోషల్ మీడియాలో టీజర్ రూపంలో విడుదల చేసింది. వీడియోలో షోరూమ్ ఎగ్జిక్యూటివ్ డెలివరీ బాయ్‌ని తన "ఆర్డర్" వైపు నడిపిస్తున్నట్లు చూపించింది. ఇందులో కంపెనీ కొత్తగా విడుదల చేసిన సబ్-కాంపాక్ట్ SUV స్కోడా కైలాక్ కనిపించింది. కంపెనీ ఈ కొత్త సేవలను ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
అయితే జెప్టోలో స్కోడాకు చెందిన అన్ని మోడల్ కార్లను డెలివరీ చేస్తుందో లేదో తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం యాడ్ ప్రకారం జెప్టోలో స్కోడా కార్ల డెలివరీ గురించి వివరాలు ఉన్నాయి కానీ కేవలం 10 నిమిషాల్లోనే అందిస్తారా లేదా అనే విషయంపై స్పష్టంతను కంపెనీ అందించలేదు. క్విక్ డెలివరీ వ్యవస్థలో చెల్లింపులు, డాక్యుమెంటేషన్ మొదలైన వాటి లాజిస్టిక్స్ ఎలా పని చేస్తాయో కూడా అస్పష్టంగా చూపించలేదు. దీనికి సంబంధించిన వివరాలను కంపెనీ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్విక్ కామర్స్ కంపెనీలు ప్రధానంగా చిన్న టిక్కెట్ అమ్మకాల కోసం తమ సేవలను అందిస్తున్నాయి. కొన్ని సంస్థలు చెప్పుల నుంచి బట్టల వరకు అన్ని వివిధ ఉత్పత్తులను ఇప్పటికే క్విక్ డెలివరీ కింద అందిస్తున్నాయి. అలాగే ఐఫోన్ల నుంచి ప్లే స్టేషన్ల వరకు ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఈ కంపెనీలు అందిస్తున్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications