IPO News: ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేసిన ఐపీవో.. తొలిరోజే బెట్టింగ్ షాక్..

Zenith Drugs IPO: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ప్రారంభం నుంచే ఒత్తిళ్లకు లోనయ్యాయి. బెంచ్ మార్క్ సూచీలు నష్టాలతో కొనసాగినప్పటికీ మార్కెట్లోకి జాబితా అయ్యేందుకు వచ్చిన ఐపీవోలు మాత్రం పెట్టుబడిదారులకు లాభాల పంట పండించాయి.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది జెనిత్ డ్రగ్స్ కంపెనీ ఐపీవో గురించే. పేరుకు చిన్న కంపెనీనే అయినప్పటికీ దరఖాస్తు చేసుకోగా ఐపీవోలో షేర్లు పొందిన వారికి మాత్రం బంపర్ లాభాలు అందుకున్నారు. ఈ క్రమంలో ఐపీవో షేర్లు 39 శాతం ప్రీమియం రేటుతో రూ.110 రేటు వద్ద శుభారంభాన్ని నమోదు చేశాయి. వాస్తవానికి కంపెనీ ఐపీవో ఇష్యూ ప్రక్రియలో ఒక్కో షేరును గరిష్ఠ ప్రైస్ బ్యాండ్ ధర రూ.79 వద్ద విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫిబ్రవరి 19 నుంచి 22 వరకు రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరచి ఉంచబడింది.

Zenith Drugs IPO slightly dissapointed investors after 39% premium listing, know details

కంపెనీ తాజా ఐపీవో ద్వారా మార్కెట్ల నుంచి తన మూలధన అవసరాల కోసం రూ.40.68 కోట్లను విజయవంతంగా సమీకరించటం జరిగింది. మార్కెట్‌లో జెనిత్ డ్రగ్స్ బలమైన లిస్టింగ్ తర్వాత షేర్లు పడిపోయాయి .జెనిత్ డ్రగ్స్ షేరు 5% క్షీణించి రూ.104.50కి చేరుకుంది. రోజు ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు కూడా గరిష్ఠ స్థాయి రూ.114.50కి చేరాయి. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి కోసం లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా విక్రయించింది. ఎవరైనా ఇన్వస్టర్ పాల్గొనాలంటే కనీసం రూ.1,26,400 పెట్టుబడిగా పెట్టారు. ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో కంపెనీ షేర్లు నేడు జాబితా చేయబడ్డాయి.

జెనిత్ డ్రగ్స్ ఐపీవో మొత్తం 179.18 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. కంపెనీ IPOలో రిటైల్ ఇన్వెస్టర్ల వర్గం 139.28 రెట్, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 368.77 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్(QIB) కోటా 106.72 రెట్లు సబ్‌స్క్రయిబ్ చేయబడింది. తాజా ఐపీవోకి ముందు కంపెనీలో ప్రమోటర్లకు 100 శాతం వాటా ఉన్నప్పటికీ ప్రస్తుతం అది 69.98 శాతానికి తగ్గింది. 2000 సంవత్సరంలో ప్రారంభించబడిన డ్రగ్స్ కంపెనీ అధిక నాణ్యత, సరమైన మందుల తయారీ వ్యాపారంలో కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+