Trending Stock: ఇటీవలి కాలంలో దేశ రక్షణపై కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించింది. దీంతో రక్షణ పరికరాలు, ఆయుధాలు, రక్షణ ఎలక్ట్రానిక్స్ వంటి సంబంధింత కంపెనీలకు వరుసగా అనేక ఆర్డర్లు వస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీల షేర్లు భారీగా లాభపడుతున్నాయి.
డ్రోన్ తయారీ సంస్థ జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్‌కు మరోసారి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఆర్డర్ వచ్చింది. దీంతో మంగళవారం కంపెనీ షేర్ ధరలో విపరీతమైన పెరుగుదల కనిపించింది. వారం రెండో ట్రేడింగ్ రోజున స్టాక్ దాదాపు 3 శాతం పెరుగుదలతో రూ.840కి చేరుకుంది. గత ఆగస్టు 17న షేరు ధర రూ.912.55కి చేరుకుందని 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.

రక్షణ శాఖ జెన్ టెక్నాలజీస్ రూ.123.3 కోట్ల విలువైన ఆర్డర్‌ను పొందింది. ఒక నెల కాలంలో కంపెనీ పొందిన మూడో ఆర్డర్ ఇది. జూన్-సెప్టెంబర్ మధ్య కాలంలో కంపెనీ మెుత్తంగా రూ.733 కోట్లు విలువైన ఆర్డర్లను పొందింది. ఇది జూన్ త్రైమాసికంలో ఆర్డర్ బుక్ రూ.542 కోట్ల కంటే ఎక్కువ. పన్నులు మినహాయిస్తే కంపెనీ ప్రస్తుత ఆర్డర్ బుక్ రూ.1,275 కోట్లుగా ఉంది. ఈ ఆర్డర్ బుక్‌లోని మొత్తం ఆర్డర్‌లలో ట్రైనింగ్ సిమ్యులేటర్‌లు సగం వరకు ఉండగా.. మిగిలినవి కౌంటర్ డ్రోన్ సిస్టమ్‌లు, సర్వీసుల నుంచి వచ్చాయి.
ఆగస్టు 31న కంపెనీ రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రూ.72.29 కోట్ల విలువైన ఆర్డర్ పొంగా.. ఆగస్టు 12న కంపెనీకి రూ.65 కోట్ల విలువైన మరో ఆర్డర్ వచ్చింది. జూన్‌లో జెన్ టెక్నాలజీస్ ఎండీ అశోక్ అట్లూరి మాట్లాడుతూ.. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆర్డర్ బుక్ 20 శాతం పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 2023 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జెన్ టెక్నాలజీస్ షేర్ ధర దాదాపు 350 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications