Zee shares: స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ఓరోజు భారీ నష్టాల్లో కుప్పకూలిన షేర్లు మరుసటి రోజు రాకెట్‌లా దూసుకుపోయిన దాఖలాలు అనేకం ఉన్నాయి. తాజాగా అటువంటి ఘటనే ఇవాళ మరోసారి రిపీట్ అయింది.
నిన్న మార్కెట్ సెషన్‌లో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 30 శాతం లోయర్ సర్క్యూట్‌కి చేరాయి. సోనీ పిక్చర్స్‌తో డీలి క్యాన్సిల్ కావడంతో స్టాక్ విలువ కుప్పకూలింది. కాగా ఇవాళ మధ్యాహ్నం 1.10 గంటకి అవే షేర్లు 8 శాతానికి పైగా ఎగబాకాయి. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి జీ షేర్లు ఇప్పటివరకు దాదాపు 44 శాతం మేర క్షీణించడం గమనార్హం.

జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌తో సోనీ పిక్చర్స్ తన 10 బిలియన్ డాలర్ల విలీన ఒప్పందాన్ని ముగించింది. అంతేకాకుండా నిబంధనల ఉల్లంఘన కారణంగా 90 మిలియన్ డాలర్ల టెర్మినేషన్ ఫీజు చెల్లించాలని కోరింది. ఈ మేరకు కల్వర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్(గతంలో సోనీ పిక్చర్స్) మరియు బంగ్లా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఈ మేరకు జీ నోటీసు అందుకుంది.
అయితే ముగింపు రుసుము కోసం సోనీ చేసిన క్లెయిమ్‌ను, ఆరోపించిన ఉల్లంఘనలను జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఖండించింది. 'షేర్‌హోల్డర్ల ప్రయోజనాల దృష్ట్యా డీల్ పూర్తి చేసేందుకు జీ నిలకడగా కృషి చేసింది. విలీన సమయాన్ని పొడిగించే ఉద్దేశ్యంతో కల్వర్ మాక్స్ మరియు BEPLతో పలుమార్లు చర్చలు జరిపింది. అయితే దురదృష్టవశాత్తు అది కార్యరూపం దాల్చలేదు' అని జీ ఓ ప్రకటనలో తెలిపింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications