Zee Stock Crash: మీడియా దిగ్గజం జీ ఎంటర్ట్మెంట్ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ అనుకున్నట్లుగానే నేడు కుప్పకూలింది. ఉదయం ఆరంభంలోనే 10 శాతానికి పైగా నష్టపోయిన స్టాక్ సాయంత్రానికి భారీ నష్టాల్లోకి కూరుకుపోయింది.
వివరాల్లోకి వెళితే అనేక లీగల్ కారణాల కారణంగా ముందుగా నిర్ణయించిన జీ-సోనీ మెర్జర్ డీల్ నిన్నటితో ముగిసిపోయింది. దీంతో ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు జీ యాజమాన్యం ప్రకటించింది. అయితే ఈ ప్రభావం ప్రస్తుతం సదరు కంపెనీలో పెట్టుటబడులు పెట్టిన ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం రూ.231.75 వద్ద ముగిసిన జీ స్టాక్ తాజా పరిణామాల కారణంగా నేడు సాయంత్రం 3 గంటల సమయానికి 32 శాతానికి పైగా నష్టపోయి రూ.156.20 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

దీనికి తోడు మార్కెట్లోని ప్రముఖ బ్రోకరేజ్ కంపెనీలు జీ స్టాక్ పై తమ అంచనాలను తగ్గించటం ఇన్వెస్టర్లలో ఆందోళనలను రేకెత్తించింది. ప్రస్తుతం బ్రోకరేజీల లెక్కల ప్రకారం స్టాక్ ధర రూ.170 నుంచి రూ.200 మధ్యన ఉంటుందని వెల్లడైంది. దీంతో చాలా మంది పెట్టుబడిదారులు జీ షేర్లను విక్రయించేందుకు పోటీపడుతున్నారు. ఇదే క్రమంలో మార్కెట్లలో బేరిష్ సెంటిమెంట్లు కొనసాగుతున్నందున షేర్ ఊహించని పతనాన్ని నమోదు చేసింది.
మోతీలాల్ ఓస్వాల్ ప్రస్తుతం షేర్లపై న్యూట్రల్‌గా కొనసాగిస్తూ టార్గెట్ ధరను రూ.200గా కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో సీఎల్ఎస్ఏ కంపెనీ షేర్లపై గతంలో ఇచ్చిన రూ.300 టార్గెట్ ధరను రూ.198కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఎంకే గ్లోబల్ షేర్లను విక్రయించాలను సూచిస్తూ టార్గెట్ ధరను రూ.175కి తగ్గించింది. జీ యజమాని పునీత్ గోయెంకాకు ఇబ్బందులు పెరుగుతున్నాయని తెలుస్తోంది. సెబీ విచారణలో రూ.1,000 కోట్ల వరకు స్వాహా చేసినట్లు వెల్లడైందని ఒక నివేదిక పేర్కొనటంతో ఆందోళనలు పెరుగుతున్నాయి. దీనికి తోడు జపాన్ సంస్థ సోనీతో డీల్ కుదరకపోవటంతో అగ్రిమెంట్ ప్రకారం జీ భారీగానే చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications