Zee Entertainment: చాలా కాలం తర్వాత జీ, సోనీ కలయికకు లైన్ క్లియర్ అయ్యింది. దీనికోసం మార్కెట్లో ఇన్వెస్టర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
నేడు జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌ను సోనీ ఇండియాలో విలీనం చేసేందుకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) ఆమోదం తెలిపింది. ఇది 10 బిలియన్ డాలర్ల మీడియాను సృష్టించే లక్ష్యంతో మెగా విలీనానికి కీలకమైన నియంత్రణ ఆమోదం. ఈ డీల్ 2021లోనే ప్రకటించబడినప్పటికీ అనేక కారణాల వల్ల ఆలస్యం అయ్యింది.

జీ కంపెనీ ప్రమోటార్లు దాని అతిపెద్ద ఇన్వెస్టర్ల మధ్య జరిగిన న్యాయపోరాటం కారణంగా ఆలస్యం జరిగింది. ఆ తర్వాత Zeeకి వ్యతిరేకంగా దాఖలైన దివాలా కేసు ఫిబ్రవరిలో నిలిపివేయబడింది. డిసెంబర్ 2021లో జీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్ తమ వ్యాపారాలను కలపడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుని అవసరమైన ఆమోదం కోసం ట్రైబ్యునల్‌ను, ఇతర సంస్థలను ఆశ్రయించాయి.
గత నెలలో యాక్సిస్ ఫైనాన్స్, JC ఫ్లవర్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కో, IDBI బ్యాంక్, Imax Corp, IDBI ట్రస్టీషిప్‌తో సహా స్కీమ్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన రుణదాతల వాదనలు విన్న NCLT ముంబై బెంచ్ ఆర్డర్‌ను రిజర్వ్ చేసింది. ZEE కంపెనీ మొత్తం పబ్లిక్ షేర్‌హోల్డింగ్ 96.01 శాతం కాగా.. ఇందులో 70 శాతం పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్‌లు కలిగి ఉన్నాయి. ప్రభుత్వేతర సంస్థలు 25.88 శాతం, ప్రమోటర్లు 3.99 శాతం మాత్రమే కలిగి ఉన్నట్లు వెల్లడైంది. తాజాగా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ గ్రీన్ సిగ్నల్ అందించటంతో ఇన్వెస్టర్లలో సంతోషం నెలకొంది. మార్కెట్లు ముగిసే సమయానికి జీ కంపెనీ షేర్ ధర 15 శాతం మేర లాభపడి రూ.281.80 వద్ద ట్రేడింగ్ ముగించింది. దీంతో షేర్ ధర ఒక్కరోజులోనే 40 రూపాయల మేర పెరిగింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications