Zee Layoffs: ఉద్యోగుల తొలగింపుల విషయంలో ఆయా కంపెనీలు పోటీతత్వాన్ని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఒక సంస్థకు మించి మరోటి సిబ్బందిని ఇంటికి పంపించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా ఇప్పుడు మరో కంపెనీ తన ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది.
గత కొంత కాలంగా నిరంతరం వార్తల్లో నిలుస్తున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్ తన శ్రామిక శక్తికి బ్యాడ్ న్యూస్ చెప్పింది. బెంగళూరులోని టెక్ ఇన్నోవేషన్ సెంటర్ లోని టీమ్ నుంచి ఏకంగా 50 శాతం మందికి పింక్ స్లిప్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. తద్వారా ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

సోనీతో విలీనం రద్దు తర్వాత జీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వనరులను ఆప్టిమైజ్ చేయడానికి మరియు నిరంతరం వృద్ధిని పెంచడానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు కంపెనీ CEO పునిత్ గోయెంకా ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. అయితే తొలగించిన ఉద్యోగుల సంఖ్యను మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
కంటెంట్ సృష్టి, పంపిణీ మరియు మానిటైజేషన్ ప్రక్రియను మెరుగుపరచడమే ఇన్నోవేషన్ సెంటర్ లక్ష్యం అని గోయెంకా తెలిపారు. 'వీక్షకులకు గొప్ప ఆకర్షణీయమైన కంటెంట్‌ని అందించడంపై దృష్టిని కేంద్రీకరిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అంచనాలకు అనుగుణంగా కంపెనీని నిర్వహించాల్సిన బాధ్యత మాపై ఉంది. సృజనాత్మక విధానం మరియు సాంకేతిక పరిష్కారాలతో వారి హృదయాలను గెలుచుకోవడం కొనసాగిస్తాము' అని వివరించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications