జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) ఛైర్మన్ సుభాష్ చంద్ర రాజీనామా చేశారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి రానుంది. అయితే ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినప్పటికీ బోర్డులో ఆయన నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. ఎస్సెల్ గ్రూపు ప్రతినిధులుగా సుభాష్ చంద్రతోపాటు పునీత్ గోయంకా కూడా బోర్డులో కొనసాగుతారు.
అంతేకాదు, జీ ఎంటర్‌టైన్‌మెంట్ బోర్డును కొంతమేర పునర్యవస్థీకరించారు. కొత్తగా ఆరుగురిని ఇండిపెండెంట్ డైరెక్టర్లగా బోర్డు నియమించుకుంది. వాటాదారుల మార్పుల దృష్ట్యా, సుభాష్ చంద్ర బోర్డు ఛైర్మన్ పదవికి చేసిన రాజీనామాను బోర్డు వెంటనే అంగీకరించింది. తాజా ఒప్పందం ప్రకారం, రెగ్యులేషన్ 17 (ఎల్‌బీ) నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

అలాగే సింగపూర్ ప్రభుత్వం, సింగపూర్ మానిటరీ అథారిటీ సెకండరీ మార్కెట్ ప్లేస్‌మెంట్ ద్వారా తమ మొత్తం హోల్డింగ్‌ను 8.44 శాతానికి పెంచిందని కూడా జీ ఎంటర్‌టైన్‌మెంట్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. నవంబర్ 21వ తేదీన జీల్‌లో 2.9 శాతానికి సమానమైన మొత్తం 2.85 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు తెలిపింది.
రుణ సంక్షోభంలో 'జీ'...
రుణ సంక్షోభంలో చిక్కుకున్న జీ 16.5 శాతం వాటాను ఇన్వెస్కో-ఒపెన్ హైమర్ ఫండ్‌కు రూ.4,224 కోట్లకు విక్రయించన్నుట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విక్రయం ద్వారా సమకూరిన నిధులను సంస్థ రుణాల చెల్లింపునకు వినియోగించుకోనుంది. ఈ 16.50 శాతంలో ఇన్వెస్కో ఒపెన్ హైమర్ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ అనుబంధ సంస్థ ఓఎఫ్‌సీ గ్లోబల్ చైనా ఫండ్‌కు 2.3 శాతం వాటాను విక్రయించనుంది. ఈ సంస్థ ఇప్పటికే జీ లిమిటెడ్‌లో 8.7 శాతం వాటాను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications