కోట్లు సంపాదిస్తున్న యూట్యూబర్ Ranveer Allahbadia: సంపద ఎంతో తెలుసా..?
Ranveer Allahbadia Row: రణవీర్ అల్లాబాడియా మనందరికీ తెలిసిన ప్రముఖ యూట్యూబర్. దేశంలోని ప్రముఖుల నుంచి అనేక మందితో పాడ్కాడ్స్ నిర్వహిస్తూ మంచి ప్రజాధరణను అందుకున్న సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఇండియాస్ గాట్ లేటెంట్ ఎపిసోడ్ లో అతడు చేసిన వ్యాఖ్యలు అందరికీ ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.
ఈ ఎపిసోడ్‌లో అల్లాబాడియా ఒక పోటీదారుడిని ఇలా అడిగాడు: "నీ జీవితాంతం ప్రతిరోజూ నీ తల్లిదండ్రులు సెక్స్ చేయడం చూస్తావా లేదా ఒక్కసారి చేరి శాశ్వతంగా ఆపేస్తావా?" అంటూ చేసిన వల్గర్ కామెంట్స్ అతని నిజస్వరూపాన్ని బయటకు తీసుకొచ్చిందని అందరూ అంటున్నారు. దీనిని చాలా మంది కామెడీగా ఫీల్ అవుతున్నారని, కానీ ఇది వల్గారిటీ అని ప్రముఖ వ్యాపారవేత్త థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ వేలుమణి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇలాంటి వారి ఛానెల్స్ చూడటం ప్రజలు బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. వీరి చానెల్స్ బ్యాన్ చేయాలని కూడా కోరారు.

యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా తాజా కామెంట్లతో పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. హాస్యనటుడు సమయ్ రైనా షో ఇండియాస్ గాట్ టాలెంట్ కొత్త ఎపిసోడ్‌లో చేసిన కామెంట్స్‌తో రణ్‌వీర్ అలహాబాడియా ట్రోల్ చేయబడ్డాడు. ప్రస్తుతం ఈ పాడ్‌కాస్టర్ పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయబడింది. 22 ఏళ్ల వయస్సు నుంచే యూట్యూబ్ వీడియోల ద్వారా భారీగా సంపాదిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు రణవీర్.
ఈ ఫేమస్ యూట్యూబర్ గురించి తెలుసుకుంటే.. జూన్ 2, 1993న ముంబైలో జన్మించిన రణవీర్ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకున్నాడు. ద్వారకాదాస్ జీవన్‌లాల్ సంఘ్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం అతడు దాదాపు 7 యూట్యూబ్ ఛానెల్‌లను నడుపుతున్నాడు. వాటిలో ఒకటి బీర్‌బైసెప్స్, దీనికి కోటి మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్న సంగతి తెలిసిందే. యూట్యూబ్ నుంచి దాదాపు రూ.35 లక్షలు అలాబాడియా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
2024లో రణవీర్ అల్లాబాడియా మెుత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.60 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. అతనికి ముంబైలో సొంత ఇల్లు కూడా ఉంది. పైగా మాంక్ ఎంటర్టైన్మెంట్ సహ వ్యవస్థాపకుడిగా రణవీర్ ఉన్నారు. అలాగే రూ.40 లక్షలు విలువైన కారు కూడా అతడికి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యూట్యూబ్ ప్రకటనలు, రాయల్టీలు, బ్రాండ్ ప్రమోషర్ల నుంచి మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు. అయితే సమాజంలో ఇంత పేరు పొందిన వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించటంపై చాలా మంది తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications