ఆదిత్య అనే యువ క్రియేటర్‌కి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో కేవలం మంది 1,500 సబ్‌స్క్రైబర్‌లు మాత్రమే ఉన్నారు. అతను తెలుగులో చిన్న చిన్న ప్రయోగాలుతో పాటుగా విలేజ్ వాతావరణం ఉట్టిపడేలా వీడియోలు చేస్తుంటాడు. అయితే అతను ఎంత మంచి కంటెంట్ పెట్టినా అతని ఛానల్ మాత్రం గ్రోత్ అవడం లేదు. అయినా ఏదో ఓ రోజు పాపులర్ కాకపోతానా అంటూ రోజూ వీడియోలు అప్ లోడ్ చేసుకుంటూ పోతున్నాడు.
అయితే ఉన్నట్లుండి ఓ రోజు అతని ఫోన్ కి నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. అదేంటంటే.. YouTube Hype is now live for your recent upload అనే ఇంగ్లీష్ లో మెసేజ్ వచ్చింది. యూట్యూబ్ నుంచి వచ్చింది కాబట్టి వెంటనే దాన్ని ఓపెన్ చేశాడు. అది ఓపెన్ చేయగానే తన కొత్త వీడియోలో Like బటన్ కింద ఈ హైప్ ఫీచర్ కనిపించింది. దాని దగ్గర నీ లాంటి 500 నుంచి 5 లక్షల మధ్య సబ్‌స్క్రైబర్‌లు ఉన్న ఛానెల్‌లకు అదనపు వ్యూస్ ఇచ్చేందుకు దీన్ని తీసుకువచ్చామని ఉంది. వెంటనే అతను ఆ ఫీచర్ యాక్టివేట్ చేసుకున్నాడు. వ్యూస్ లక్షల్లో అందుకున్నాడు.

మీరు కూడా హైప్ ఫీచర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇంకెందుకాలస్యం స్టొరీ చదివి తెలుసుకోండి. యూట్యూబ్ ఎల్లప్పుడూ కొత్త సృష్టికర్తలను ప్రోత్సహించడానికి వినూత్న మార్గాలను వెతుకుతుంది. ఇప్పుడు, భారతదేశంలో చిన్న కంటెంట్ క్రియేటర్లకు గేమ్-ఛేంజర్‌గా మారే మరో పెద్ద అడుగు వేసింది. యూట్యూబ్‌లో కొత్తగా వచ్చే క్రియేటర్ల కోసం యూట్యూబ్ తీసుకువచ్చిన కొత్త ఫీచర్ పేరే హైప్. క్రియేటర్లు తాము చేసిన వీడియోలు ఎక్కువ మందికి చేరేందుకు, ఎక్కువ వ్యూస్ పొందేందుకు ఇండియాలో ఈ ఫీచర్ తీసుకువచ్చింది యూట్యూబ్ సంస్థ.
యూట్యూబ్ ఛానళ్లు 500 నుంచి 5 లక్షల వరకు సబ్‌స్క్రైబర్లు కలిగి ఉన్న వారికి ఇది ప్రత్యేకంగా అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌కు అర్హత పొందిన ఛానల్‌లో కింది భాగంలో కొత్తగా వచ్చిన హైప్ అనే బటన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే కొన్ని వీడియో పాయింట్స్ అందులో యాడ్ అవుతాయి. తద్వారా హైప్ ఇచ్చిన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి హైప్ పొందిన వీడియో పాయింట్ల ఆధారంగా టాప్-100 జాబితాలోకి ఆ వీడియో చేరుతుంది. మీ యూట్యూబ్‌లోని ఎక్స్‌ప్లోర్ ట్యాబ్‌లో హైప్ వీడియోల జాబితా మెనూ కనిపిస్తుంది.
యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో చేరిన క్రియేటర్లు ఈ హైప్ ఫీచర్‌కు అర్హులు. వారు తమ ఛానల్ ద్వారా కనీసం 500 నుంచి 5 లక్షల వరకు సబ్‌స్క్రైబర్లు కలిగి ఉండాలి. హైప్ ఫీచర్ అర్హత సాధించిన వారికి ఆటోమేటిక్‌గా ఛానల్ కింద ఈ ఫీచర్ కనిపిస్తుంది. ఇక ఈ ఫీచర్ పొందాలంటే ఆ వీడియో కనీసం 7 రోజుల్లోపు ఛానల్లో అప్‌లోడ్ అయ్యి ఉండాలి.ఆ తర్వాత కాని ముందు కాని వీడియోలకు ఆప్సన్ ఉండదు. ఇక మరో విశేషం ఏంటంటే.. వ్యూయర్స్ కూడా తాము చూసే వీడియోలకు హైప్ ఇవ్వొచ్చు.
లైక్, షేర్ తరహాలో లైక్ బటన్ కిందే ఉండే ఈ 'హైప్' బటన్‌ను క్లిక్ చేసి వీడియోకి హైప్ ఇవ్వొచ్చు.మీకిష్టమైతే Hype బటన్ నొక్కి నన్ను టాప్ 100కి తీసుకెళ్లండి అనే మెసేజ్ అక్కడ కనిపిస్తుంది. ఒక వారంలో మూడు ఫ్రీ హైప్‌లు వరకు ఇచ్చే ఛాన్స్ ఉంది. వ్యూయర్స్ ఇచ్చిన హైప్ బటన్ ద్వారా ఆ వీడియో లీడర్‌బోర్డులో పైకి వస్తుంది. తద్వారా యూట్యూబ్ రికమెండేషన్‌లోనూ ఆ వీడియో దర్శనమిస్తుంది. మీకిష్టమైతే Hype బటన్ నొక్కి క్రియేటర్లకు సాయం చేయవచ్చు.
చిన్న ఛానెల్స్‌కు ప్రోత్సాహం ఇవ్వడానికి, తక్కువ సబ్‌స్క్రైబర్లతో ఉన్న క్రియేటర్లకు యూట్యూబ్ అదనపు బోనస్ పాయింట్లను ఇస్తుంది. దీనివల్ల పెద్ద, స్థిరపడిన ఛానెల్స్‌తో పోటీ పడటానికి కొత్త క్రియేటర్లకు అవకాశం లభిస్తుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications