సినిమా ప్రియులకు ఇది ఓ సూపర్ ఆఫర్! The District App అనే ఓ ప్లాట్‌ఫాం ఇప్పుడు వినియోగదారులకు కేవలం రూ. 10కే సినిమా టికెట్ బుకింగ్ అవకాశం కల్పిస్తోంది. కానీ ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. ఈ ఆఫర్ ప్రతి వారంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది, అది కూడా కేవలం 10 నిమిషాల పాటు మాత్రమే!

ఆఫర్ ఎప్పుడంటే?
ఈ స్పెషల్ డీల్ ప్రతి శుక్రవారం ఉదయం 10:00 గంటలకు ప్రారంభమవుతుంది. కనుక మీరు ఈ అవకాశం మిస్ కావాలంటే ఉదయం 10:00కి అప్లికేషన్ ఓపెన్ చేసి 10:10లోపు మీ టికెట్ బుక్ చేసుకోవాలి.
ఎలా పనిచేస్తుంది?
The District App ద్వారా మీరు సినిమా టికెట్ బుక్ చేసుకోవచ్చు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ ఆఫర్ యాక్టివ్ అవుతుంది. ఆ సమయానికి లాగిన్ అయ్యి, టికెట్‌ను సెలెక్ట్ చేసుకుంటే
మామూలుగా రూ 200 - రూ 300 విలువ చేసే టికెట్ కేవలం రూ 10కే మీ చేతికి వస్తుంది. కానీ ఇది "First come, first served" విధానంలో పని చేస్తుంది. అంటే మొదటగా బుక్ చేసుకునే వారికి మాత్రమే లభిస్తుంది.
District App డౌన్‌లోడ్ & యూజ్ చేయడంపై స్టెప్-బై-స్టెప్ గైడ్:
District Appను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేయండి. హోం స్క్రీన్‌లో "Movies" సెక్షన్‌కు వెళ్లండి. శుక్రవారం 10:00 AMకి ఆఫర్ లైవ్ అయిన వెంటనే సినిమా సెలెక్ట్ చేసి, టికెట్ బుక్ చేయండి. పేమెంట్ త్వరగా పూర్తయ్యేలా UPI లేదా కార్డ్ డీటెయిల్స్ ముందే సేవ్ చేసుకోండి.
ఈ డీల్ ప్రత్యేకతలు:
ప్రతి వారం కొత్త సినిమా, కొత్త టికెట్ ఆఫర్ ఉంటుంది. మీ దగ్గర ఫాస్ట్ ఇంటర్నెట్, District App ఉండి, రెడీగా ఉంటే మీరు ఈ అవకాశం పొందవచ్చు. ఇది ప్రమోషనల్ క్యాంపెయిన్ కింద వస్తోంది, కనుక ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుందో తెలియదు.
ఈ ఆఫర్ ప్రస్తుతం పూర్తి దేశంలో అందుబాటులో ఉందని స్పష్టమైన అధికారిక సమాచారం లేదు. అయినప్పటికీ, రెడ్డిట్ వంటివి అనేక వేదికలలో వినియోగదారులు ఈ ఆఫర్ తీసుకుని సక్సెస్ ఫుల్‌గా టికెట్ బుక్ చేసిన ఫీడ్‌బ్యాక్‌లు పాత పోస్ట్‌లలో కనిపిస్తున్నాయి.
ఈ 10 నిమిషాల ఆఫర్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. కొంతమంది బుక్ చేయగలుగుతున్నారు, మరికొంతమంది "సోల్డ్ అవుట్" స్క్రీన్ చూసే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కనుక మీరు ఈ ఆఫర్ పొందాలంటే ఊహించదగ్గ సమయానికి ముందే District App ఓపెన్ చేసి, టికెట్ సెలెక్ట్ చేసుకుని వేగంగా చెల్లింపు చేయాలి.


Click it and Unblock the Notifications