ఈ రోజు మనం ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు, రేపటి జీవితాన్ని ఎంత బాగా ప్లాన్ చేసుకున్నామన్నదే నిజమైన ఆర్థిక విజయం. ఇప్పటివరకు జీతాలు వస్తున్నాయ్, ఖర్చులు కట్టేస్తున్నారు, కానీ మనకి ఉద్యోగం లేని రోజుల్లో కూడా మనల్ని మనమే సపోర్ట్ చేసుకోవాలంటే? అక్కడే వస్తుంది రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి. ఇప్పుడు చాలా మంది మధ్యతరగతి ఉద్యోగులు ఎదుర్కొంటున్న అసలు ప్రశ్న "EPF కొనసాగించాలా? లేక NPS పెట్టుబడిగా ఎంచుకోవాలా?"

రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక స్థిరత్వం కోసం ముందుగానే పెట్టుబడి ప్రారంభించాలి. దీర్ఘకాలిక సంపద సృష్టి ప్రణాళిక మీ రిటైర్మెంట్ లక్ష్యాలను చేరుకోవడంలో కీలకం. ఇది మీ పెట్టుబడులను సమీక్షించడానికి, రిటైర్మెంట్ కార్పస్ నిర్మించడానికి సరైన సమయం కావచ్చు. ప్రస్తుతం అన్ని ఆదాయ వర్గాల వారికి అనేక రకాల పొదుపు సాధనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రజాదరణ పొందిన రెండు ప్రభుత్వ ఆధారిత పథకాలు ప్రావిడెంట్ ఫండ్ (PF/EPF), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS). ప్రతి పథకానికి ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి హామీ ఇచ్చిన వడ్డీని ఇస్తే, మరొకటి మార్కెట్ ఆధారిత లాభాలు పొందే అవకాశం ఇస్తుంది.
PF అంటే ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ (EPF). ఇది ఉద్యోగం చేస్తున్నవాళ్ల కోసం ప్రభుత్వానికి చెందిన ఒక పొదుపు ప్లాన్. మీ జీతం నుంచి ప్రతి నెల కొంత మొత్తం తీసి, అదే మొత్తాన్ని కంపెనీ కూడా వేస్తుంది. ఇలా నెలలుగా క్రమంగా పెరుగుతూ, ఈ మొత్తాలు ఒక పెద్ద పొదుపుగా తయారవుతాయి. ఫిక్స్‌డ్ వడ్డీ (ఈ ఏడాది అంటే FY25లో 8.25%). రిస్క్ లేని పెట్టుబడి మరియు ట్యాక్స్ ఫ్రీ లాభాలు పొందవచ్చు. చిన్నగా మొదలైనా, మీరు ఉద్యోగం చేసేంతకాలం ఈ ఫండ్ క్రమంగా పెరిగి, రిటైర్మెంట్ టైమ్‌కి బాగా ఉపయోగపడుతుంది.
ఇది ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేషనల్ పెన్షన్ సిస్టమ్. మార్కెట్‌కు అనుసంధానమైనది, అంటే రాబడి స్థిరంగా ఉండదు కానీ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది దీన్ని ఎంచుకుంటున్నారు ఎందుకంటే పన్ను మినహాయింపులు ఎక్కువ (రూ. 2 లక్షల వరకు), అలాగే దీర్ఘకాలంలో రిటర్న్స్ బాగుంటాయి. ఇది రిటైర్మెంట్ తర్వాత ఒక భాగాన్ని మీకు ఒకేసారి ఇస్తుంది, మిగతా భాగాన్ని నెల నెలా పింఛన్‌గా ఇస్తుంది. అంటే పెద్ద ఎమౌంట్ అవసరమైనవారికి ఇది కొన్ని పరిమితులు ఉంటాయి, కానీ రెగ్యులర్ ఆదాయం కోరేవారికి ఇది బాగుంటుంది.
EPF vs NPS రెండింటిలో ఏది ఎంచుకోవాలి అన్నది ప్రతి ఉద్యోగి ఎదుర్కొనే సాధారణ సందేహం. మీరు ఒక ప్రైవేట్ ఉద్యోగి అయితే EPF (ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్) మంచిది. ఒకవేళ మీకు ఇప్పటికే ఉంటే, దాన్ని కొనసాగించడం మంచిదే. ఇది స్థిరమైన వడ్డీతో రిస్క్ లేని పెట్టుబడిగా పనిచేస్తుంది. అదే సమయంలో, ఎక్కువ కాలానికి ఎక్కువ రాబడి కావాలనుకునే వారు మాత్రం NPS (నేషనల్ పెన్షన్ సిస్టమ్) వైపు మొగ్గు చూపవచ్చు. ఇది మార్కెట్‌కు అనుసంధానమై ఉంటుంది కాబట్టి రిస్క్ ఎక్కువైనా, లాంగ్ టర్మ్‌లో రిటర్న్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
మీరు రిటైర్మెంట్ టైమ్‌కి మొత్తం డబ్బు విత్‌డ్రా చేయాలని చూస్తే EPF బెటర్. కానీ నెల నెలకి పెన్షన్‌గా రాబడులు రావాలని కోరుకుంటే NPSను ఎంచుకోవచ్చు.
పన్ను ప్రయోజనాల విషయంలో, EPFలో ఉద్యోగి సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు పొందగలడు, అలాగే వడ్డీపై రూ. 2.5 లక్షల వరకు పన్ను లేదు. NPSలో మాత్రం సెక్షన్ 80C మరియు 80CCD(1B) కింద రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది, ఇది EPF కంటే ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. EPFలో వడ్డీ రేటు ప్రభుత్వ హామీతో సుమారు 8.25% స్థిరంగా ఉంటుంది, కానీ NPSలో పెట్టుబడి మార్కెట్ ఆధారితంగా ఉంటుంది. గతంలో NPS సగటుగా 8-11% రాబడులు ఇచ్చింది, కాబట్టి ఇది కొంత రిస్క్ ఉన్న పెట్టుబడి.
ఉపసంహరణ నిబంధనల్లో కూడా తేడా ఉంది. EPFలో ఐదు సంవత్సరాల నిరంతర సేవ తర్వాత మాత్రమే ఉపసంహరణ సాధ్యమయ్యేది, మరియు 58 ఏళ్ల వయస్సుకు పూర్తి ఉపసంహరణ అందుతుంది. NPSలో 60 ఏళ్ల వయస్సులో మొత్తం కార్పస్ లో 60% ఉపసంహరించుకోవచ్చు, మిగిలిన 40%తో నెలవారీ పెన్షన్ ప్లాన్ కొనాల్సి ఉంటుంది. EPFలో ఉద్యోగి మరియు యజమాని ఇద్దరూ కాంట్రిబ్యూట్ చేస్తారు, కానీ NPSలో వ్యక్తిగతంగా మాత్రమే పెట్టుబడి చేయవచ్చు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications