Infosys ఉద్యోగం మానేసిన టెక్కీ.. వ్యాపారంతో రూ.100 కోట్లు సంపాదన..!!
ఒకప్పుడు ఉన్నత చదువులు చదువుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం లేదా ఫారెన్ వెళ్లి సెటిల్ అవ్వటం అనే రెండు ఆలోచనలు మాత్రమే ఉండేవి. కానీ నేటి తరం యువత వ్యాపారాల వైపు ఆకర్షితులు అవుతున్నారు.
బెంగళూరులోని ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బిరాజా రౌట్‌కు బర్గర్‌లంటే చాలా ఇష్టం. ఏదో ఒక అద్భుతమైన భారతీయ బ్రాండ్ బర్గర్‌లను తయారు చేసి విక్రయించాలనే ఆలోచన వచ్చింది. దీంతో తన టెక్ ఉద్యోగానికి రాజీనామా చేసి కేవలం రూ.20 వేలు పెట్టుబడితో చిన్న స్థాయిలో తన ఉద్యోగాన్ని ప్రారంభించాడు. తొలుత తాను పనిచేసిన ఆఫీసు సమీపంలో రోడ్డుపై కియోస్క్ ఏర్పాటు చేసి బర్గర్లు అమ్మడం ప్రారంభించాడు.

సహచర ఉద్యోగులు, మిత్రులు తొలుత కస్టమర్లుగా మారారు. బిరాజా రౌత్ తయారుచేస్తున్న గ్రిల్డ్ బర్గర్ రుచి నచ్చటంతో ఎక్కువ మంది ఆహార ప్రియులను ఆకర్షించింది. ఇదంతా జరిగింది కేవలం 21 ఏళ్ల వయస్సులోనే జరిగింది. బెంగళూరులోని రౌత్స్ బర్గర్ మెక్‌డొనాల్డ్స్, KFC మరియు బర్గర్ కింగ్ బ్రాండ్‌లకు గట్టి పోటీనిచ్చింది. దీంతో అతడు బిగ్గీస్ బర్గర్ అనే కొత్త కంపెనీని ప్రారంభించాడు. అలా ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న అతని దుకాణానికి చాలా మంది కస్టమర్లు బర్గర్స్ రుచి చూసేందుకు వచ్చేవారు.
అలా ఫుడ్ లవర్స్ మనసు గెలుచుకోవటంతో బిగ్గీస్ బర్గర్స్ క్రమంగా లాభాలను ఆర్జించడం ప్రారంభించింది. 2023 నాటికి బిగ్గీస్ బర్గర్ కంపెనీ ఆదాయం రూ.100 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం రౌత్ తన వ్యాపారాన్ని టైర్-2,3 నగరాలకు విస్తరించాలనే ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఏటా రూ.200 కోట్లు టర్నోవర్ ఆదాయాన్ని చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం బిగ్గీస్ బర్గర్ 14 రాష్ట్రాల్లోని 28 నగరాల్లో 130 శాఖలను ప్రారంభించింది. 2024 నాటికి వీటి సంఖ్యను 350కి పెంచాలని కసరత్తులు చేస్తున్నారు. అలా ఒక యువ టెక్కీ జీవితాన్ని ఆహార రంగం పూర్తిగా మార్చేసింది.


Click it and Unblock the Notifications