Young Techie: రూ.33 లక్షల జాబ్ ఆఫర్ కొట్టేసిన బుడ్డోడు.. సరదాగా పాల్గొంటే.. కానీ ట్విస్ట్ ఏంటంటే..
Young Techie: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన వేదాంత్ అనే 15 ఏళ్ల బాలుడి పేరు ఇప్పుడు టెక్ ప్రపంచంలో వైరల్ గా మారింది. అతి చిన్న వయస్సులోనే అతడి ప్రతిభ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టెక్నాలజీని సరైన మార్గంలో ఉపయోగిస్తూ భారీ ఆఫర్ కొట్టేశాడు.

వేదాంత్ ప్రతిభ..
వేదాంత్ తన తల్లి పాత ల్యాప్‌టాప్‌లో ఎప్పటిలాగే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను స్క్రోల్ చేస్తున్నప్పుడు వెబ్‌సైట్ అభివృద్ధి పోటీకి సంబంధించిన లింక్ ప్రకటనను గమనించాడు. అది తన జీవితానికి టర్నింగ్ పాయింట్ అవుతుందని భవిశా అతడు కూడా ఎప్పుడూ అనుకోకపోయి ఉండవచ్చు.

వెబ్‌సైట్ అభివృద్ధి పోటీ..
అతను ఈ వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా కేవలం రెండు రోజుల్లోనే 2,066 లైన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోడ్‌ను రాసి అమెరికా కంపెనీలో రూ.33 లక్షల ప్యాకేజీతో ఉద్యోగ ఆఫర్ సంపాదించాడు. ఇలా గెలుపొందిన బాలుడు తన డ్రీమ్ జాబ్‌ను పొందినట్లు చెబుతున్నాడు.

15 ఏళ్లు కావటంతో..
పోటీ ముగిసిన తరువాత వేదాంత్ వయస్సు కేవలం 15 సంవత్సరాలని తెలుసుకున్న సదరు కంపెనీ ఆఫర్ ను ఉపసంహరించుకుంది. వేదాంత్‌ను నిరుత్సాహపడవద్దని, అతని పాఠశాల విద్య పూర్తయిన తర్వాత కంపెనీని సంప్రదించమని న్యూజెర్సీ కంపెనీ కోరింది.

వెబ్‌సైట్ అభివృద్ధి..
వేదాంత్ animeeditor.com అనే వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేశాడు. ఇది వినియోగదారులకు అదనపు ఫీచర్‌లతో బ్లాగ్‌లు, వ్లాగ్‌లు, చాట్‌బాట్, YouTube లాంటి వీడియో వీక్షణ ప్లాట్‌ఫారమ్ వంటి వీడియోలను అప్‌లోడ్ చేసే అవకాశాన్ని అందిస్తుంది.

నారాయణ స్కూల్లో పథకం..
నారాయణ ఈ-టెక్నో పాఠశాలలో జరిగిన సైన్స్ ఫెయిర్‌లో రాడార్ సిస్టమ్ నమూనాను రూపొందించి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. వేదాంత్ తల్లిదండ్రులు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉన్నారు. కొత్త జాబ్ ఆఫర్ గురించి తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు అతనికి కొత్త ల్యాప్‌టాప్ కొని ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా 1000 మంది ఈ పోటీలో పాల్గొనగా.. వేదాంత్ ఎంపికయ్యాడు.


Click it and Unblock the Notifications