కేంద్ర ప్రభుత్వం ఒంటరి మహిళలను, వృద్ధులను దృష్టిలో ఉంచుకొని ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. అలాగే వికలాంగులకి కూడా కొన్ని ప్రత్యేక ప్రయోజనాలనతో కూడిన పథకాలను అమలు చేస్తుంది. మరోవైపు ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) 2025 రిజిస్ట్రేషన్ గడువును కేంద్ర ప్రభుత్వం తాజాగా పొడిగించింది. అంటే గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయిన విద్యార్థులకు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఈ కారణంగా ఎంతో మంది యువత వివిధ రంగాలలో ఇంటర్న్‌షిప్ ద్వారా ప్రయోజనం పొందే అవకాశం లభిస్తుంది. దింతో పొడిగించిన కొత్త గడువు ఇప్పుడు 31 మార్చ్, అలాగే ఆసక్తిగల అభ్యర్థులు ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకోవడానికి ఇంకా క్రియేట్ చేసుకోవడానికి ఎక్కువ సమయం దొరికింది.

చాలా జిల్లాల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం మొదట్లో రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీని మార్చి 12గా నిర్ణయించారు. ఇప్పుడు దానిని మార్చి 31 వరకు పొడిగించారు. ఈ పథకం సెకండ్ రౌండ్ పైలట్ ప్రక్రియని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దింతో 730 జిల్లాల నుండి లక్ష మందికి పైగా అభ్యర్థులు టాప్ కంపెనీలతో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం పొందుతారు. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం ఎప్పుడు ప్రారంభమైందంటే : గత ఏడాది జూలైలో కేంద్ర ఇంటెర్మ్ బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధానమంత్రి ఈ ఇంటర్న్‌షిప్ పథకాన్ని ప్రకటించారు. భారతదేశంలోని లక్షలాది మంది విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించడం దీని దృష్టి. దీనికి సెలెక్టయిన అభ్యర్థులు టాప్ 500 కంపెనీలలో ఇంటర్న్‌షిప్ పొందుతారు, దీని వల్ల స్కిల్స్ మెరుగుపరుస్తుంది ఇంకా కెరీర్ అవకాశాలను పెంచుతుంది. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం లక్ష్యం యువతకు పరిశ్రమలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధికి సిద్ధం చేయడం.
ఇంటర్న్‌షిప్ సమయంలో స్టైపెండ్ : ఇంటర్న్‌షిప్ సమయంలో ప్రభుత్వం ప్రతి నెలా రూ.5,000 ఆర్థిక సహాయం అందిస్తుంది, ఇందులో రూ.4,500 ప్రభుత్వం, రూ.500 ఇంటర్న్‌షిప్ అందించే సంస్థ అందిస్తాయి. ఇంటర్న్‌షిప్ ప్రారంభించడానికి ప్రభుత్వం రూ.6,000 గ్రాంట్ కూడా అందిస్తుంది. దీనితో పాటు, ఈ పథకం కింద ఉన్న అన్ని ఇంటర్న్‌లు ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) అలాగే ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) కింద ఇన్సూరెన్స్ పొందుతారు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఈ పథకం కోసం మీ వయస్సు 21 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అంతేకాకుండా అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల కంటే తక్కువగా ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 12వ తరగతి ఉత్తీర్ణత, ITI, డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్ (BA, B.Sc, B.Com, BBA, BCA, B.Pharma మొదలైనవి) డిగ్రీ పొంది ఉండాలి. దీనితో పాటు IIT, IIM, IISER, NID గ్రాడ్యుయేట్లు, నేషనల్ లా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్, CA, CMA, CS, MBBS, BDS, MBA లేదా మాస్టర్స్ డిగ్రీ హోల్డర్లు, ఇప్పటికే ప్రభుత్వ ఇంటర్న్‌షిప్ లేదా అప్రెంటిస్‌షిప్ చేస్తున్న అభ్యర్థులు ఇంకా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగాల్లో శాశ్వత ఉద్యోగులుగా ఉన్న అభ్యర్థులు ఈ స్కిం బెనిఫిట్స్ అర్హులు కాదు అని గమనించాలి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications