ఢిల్లీ: మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పెట్రోలియం అండ్ నేచరల్ గ్యాస్ రామేశ్వర్ తేలీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై స్పందించారు. పెట్రోల్ ధరను ప్యాకేజ్డ్ మినరల్ వాటర్‌తో పోల్చారు. ప్యాకింగ్ మినరల్ వాటర్ ధర పెట్రోల్ కంటే ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. పెట్రోల్, డీజిల్ పైన వచ్చిన డబ్బుతో ప్రజలకు ఉచిత వ్యాక్సీన్ అందిస్తున్నట్లు చెప్పారు. చమురు ధరల పైన పన్ను ఉన్నందువల్ల, ఈ మొత్తం ద్వారా వ్యాక్సీన్‌కు నిధులు సమకూరినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఇటీవల మీడియాతో మాట్లాడారు. పెట్రోల్ ధర ఎక్కువగా లేదని, కానీ పన్నులు అధికంగా ఉన్నట్లు చెప్పారు. పెట్రోల్ పైన వ్యాట్(వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్) తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అసోం ఒకటి అన్నారు. రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ పైన పన్నులు ఎక్కువగా ఉన్నాయి.

పెట్రోల్ కంటే నీటి ధర ఎక్కువ
'పెట్రోల్ ధర ఎక్కువగా లేదు. ఇందులో పన్ను కూడా ఉంది. ప్యాక్ చేయబడిన మినరల్ వాటర్ కంటే పెట్రోల్ ధర కంటే ఎక్కువగా ఉంది. పెట్రోల్ ధర లీటర్‌కు రూ.40 మాత్రమే. అసోం రాష్ట్రంలో వ్యాట్ 28 శాతంగా ఉంది. పెట్రోలియం శాఖ విధించే పన్ను రూ.30. ఈ ట్యాక్స్ నేపథ్యంలో ధర రూ.98కి పెరుగింది. అదే సమయంలో మీరు హిమాలయ వాటర్ బాటిల్ కొనుగోలు చేసి తాగితే, ఈ ధర రూ.100గా ఉంది. అంటే ఇక్కడ ధర చాలా ఎక్కువగా ఉన్నది పెట్రోల్, డీజిల్ కాదు. నీటి ధర ఎక్కువగా ఉంది' అన్నారు.

ఉచిత వ్యాక్సీన్
కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే మొత్తం కరోనా నేపథ్యంలో ఉచిత వ్యాక్సీన్ కోసం ఉపయోగపడుతోందని కేంద్రమంత్రి అన్నారు. ఇక్కడ ఇంధన ధరలు ఎక్కువగా లేవని, కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన పన్నులతో కలుపుకుంటే ధరలు ఈ స్థాయికి చేరుకున్నాయని చెప్పారు. 'మీరు తప్పనిసరిగా ఉచిత వ్యాక్సీన్ వేసుకోవాలి. ఆ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, మీరు డబ్బులు చెల్లించలేదు, వ్యాక్సినేషన్ కోసం ఇది ఉపయోగపడింది. పన్నుల ద్వారా వచ్చిన మొత్తం వ్యాక్సీన్ కోసం ఉపయోగపడింది' అని చెప్పారు.

రాజస్థాన్‌లో అధిక ధర
రాజస్థాన్ రాష్ట్రంలో పెట్రోల్ ధర అత్యధికంగా ఉందని, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పైన గరిష్ట ట్యాక్స్ విధించిందని కేంద్రమంత్రి అన్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ధరను తగ్గించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అలా చేయదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించాలని సూచించారు. పెట్రోల్ ధరల పెరుగుదలకు కేవలం కేంద్రాన్ని బాధ్యులను చేయడం సరికాదని, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్స్ విధిస్తున్నాయన్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications