మీరు కూడా ముఖేష్ అంబానీ ఇంటికి చూడాలనుకుంటున్నారా... అయితే మీ కోరిక ఈజీగా నెరవేరుతుంది, అది కూడా కేవలం 2 రూపాయలకే. అవును నిజమే.. ఇప్పుడు మీరు ముఖేష్ అంబానీ చిన్నప్పటి ఇంటిని సందర్శించవచ్చు. గుజరాత్‌లోని చోర్వాడ్‌లో ఉన్న ధీరూభాయ్ అంబానీ మెమోరియల్ హౌస్ ఒకప్పుడు ముఖేష్ అంబానీ, అతని కుటుంబ పూర్వీకుల ఇల్లు, ఇప్పుడు ఈ ఇల్లు ప్రజల కోసం తెరిచి ఉంది. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ వాళ్ల బాల్యాన్ని గడిపిన ఇల్లు కూడా ఇదే. దాదాపు 100 సంవత్సరాల నాటి ఈ ఇంటి ధర దాదాపు 100 కోట్ల రూపాయలకి పైగానే ఉంటుందని చెబుతుంటారు.

గుజరాత్‌లో పూర్వీకుల ఇల్లు : గతంలో అంబానీ కుటుంబ ఇల్లుగా ఉన్న ధీరూభాయ్ అంబానీ మెమోరియల్ హౌస్ ఇప్పుడు మ్యూజియంగా మారింది. ఈ రెండంతస్తుల భవనం గుజరాతీ స్టయిల్'లో ఉంటుంది. ఈ ఇంటిలోని ప్రతి మూల అంబానీ కుటుంబ పోరాటం, విజయాల కథను చెబుతుంది. ఈ ఇంటికి చెక్కతో చెక్కిన కిటికీలు, అందమైన తోట ఉన్నాయి. ఈ ఇల్లు ధీరూభాయ్ అంబానీ తండ్రి హీరాచంద్ గోర్ధన్‌భాయ్ అంబానీకి చెందినది, ఇక్కడి నుండే ముకేష్ అంబానీ కుటుంబం జీవిత ప్రయాణాన్ని ప్రారంభించింది.
ప్రజలకు అందుబాటులోకి : అయితే 2011 సంవత్సరంలో ఈ ఇంటిని పబ్లిక్ మ్యూజియంగా మార్చారు, ఇక్కడే ధీరూభాయ్ అంబానీ ఫోటోలు, ఆయన జ్ఞాపకాలు ఇంకా అవార్డులు భద్రపర్చారు. అమితాబ్ టియోటియా డిజైన్స్ సహాయంతో ఈ ఇంటిని సోలార్ లైట్లతో మోడిఫై చేసారు.
మీరు కూడా ఈ ఇంటిని చూడాలనుకుంటే ప్రతి మంగళవారం నుండి ఆదివారం వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వెళ్లి చూడొచ్చు. అది కూడా టికెట్ ధర కేవలం రూ. 2 మాత్రమే. ఇక్కడ మీరు అంబానీ కుటుంబ కథ గురుంచి కూడా తెలుసుకోవచ్చు, వీరి జీవితానికి సంబంధించిన పుస్తకాలను కూడా కోనవచ్చు.ప్రతి సోమవారాలు ఇంకా ప్రభుత్వ హాలిడేస్ రోజుల్లో మూసివేసి ఉంటుంది.
యాంటిలియా ధర: ముంబైలోని ముఖేష్ అంబానీకి చెందిన ఆంటిలియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ ఇళ్లలో ఒకటి, దీని విలువ దాదాపు రూ.15,000 కోట్లు. ఈ 27 అంతస్తుల భవనం 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 3 హెలిప్యాడ్‌లు, 168 కార్ల పార్కింగ్, 50 సీట్ల థియేటర్, స్విమ్మింగ్ పూల్, స్పా ఇంకా AC లేకుండా ప్రత్యేకమైన కూలింగ్ టెక్నాలజీ వంటి సౌకర్యం ఉంది.


Click it and Unblock the Notifications