Investment: మీ అమ్మాయి చదువు, పెళ్లికి డబ్బు కావాలా.. అయితే ఇలా చేయండి..!
ఒకప్పుడు ఆడ పిల్ల పుట్టిందంటే చాలు చాలా ఘోరంగా చూసేవారు. ఆ తర్వాత కాలం మారుతూ వస్తోంది. ఇప్పుడిప్పుడే తల్లిదండ్రుల్లో మార్పు వస్తోంది. కొడుకైనా, కూతురైనా ఒకటే అని అనుకుంటున్నారు. అయితే కుమార్తె ఉన్నావారు.. వారి చదువు, పెళ్లి కోసం ఎంతో కొంత కూడబెట్టాలి. ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకం తీసుకొచ్చింది.
ఆడ పిల్ల ఉన్నవారికి సుకన్య సమృద్ధి యోజన పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకంలో సంవత్సరానికి కనిష్ఠంగా రూ.250 పొదుపు చేయవచ్చు. గరిష్ఠంగా రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. సుకన్య సమృద్ధు యోజనలో 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పాప వయస్సు 21 ఏళ్ల కాగానే మెచ్యూరిటీ సొమ్ము వస్తుంది. అమ్మాయికి 18 నిండిన తర్వాత కూడా కొంత మొత్తం డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందులు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.

సుకన్య సమృద్ధి యోజనలో ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. మీరు మీ కూతురు కోసం నెలకు రూ.2 వేలు పొదుపు చేస్తే మెచ్యూరిటీ రూ. 11,08,412 వస్తుంది. మీరు నెలకు రూ.4 వేలు జమ చేస్తే రూ.22,16,825 వస్తాయి. నెలకు రూ.6 వేలు జమ చేస్తే 33,25,237 వస్తాయి. మీరు నెలకు రూ.12,500 మీ కుమార్తె కోసం పొదుపు చేస్తే రూ. 69,27,578 పొందవచ్చు.
ఉదాహణకు మీరు మీ కుమార్తె కోసం నెలకు 5 వేలు పొదుపు చేద్దామనుకుంటే.. ఇందులో రూ.4 వేలు సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టొచ్చు. మిగిలన రూ.1000 లను ఎదైనా స్మాల్ క్యాప్ మ్యూవల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టొచ్చు. మీరు సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టిన కాలమంతా.. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి మంచి రాబడి వచ్చే అవకాశం. దీర్ఘకాలికంగా ఈక్విటీలో మంచి రాబడి రావడానికి ఛాన్స్ ఉంది.
మీరు మ్యూచువల్ ఫండ్లలో 12 శాతం రిటర్న్స్ అంచనా వేస్తే మీకు 15 సంవత్సరాల నెలకు రూ.1000 సిప్ కు 12 రాబడితో 15 ఏళ్లలో రూ.5,04,576 వస్తాయి. ఇందులో వచ్చే రాబడి గ్యారెంటీ కాదు. కానీ సుకన్య సమృద్ధి యోజనలో వచ్చే రాబడికి మాత్రం హామీ ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన, స్మాల్ క్యాప్ మ్యూవల్ ఫండ్ పెట్టుబడి పెట్టినట్లయితే మీరు రూ.27 లక్షల వరకు మీకు కుమార్తెకు సిద్ధం చేయవచ్చు.
Note: ఈ వార్త సిఫార్సు కాదు కాదు. కేవలం సమాచారం మాత్రమే.


Click it and Unblock the Notifications