మీ ఏరియాలో ఏ నెట్ వర్క్ సిగ్నల్ బాగా వస్తుందో సింపుల్‌గా తెలుసుకోవచ్చు
దాదాపు ఇప్పుడు అందరు ఫోన్లు వాడుతున్నారు. అయితే ప్రతి చోట అన్ని నెట్ వర్క్స్ రావు. ఈ నేపథ్యంలో ఇబ్బంది పాడాల్సి రావచ్చు. ఎవరైనా కొత్త ఇంటికి మారినప్పుడు అక్కడ ఏ నెట్ వర్క్ సిగ్నల్ వస్తుందో తెలియదు. దీంతో అక్కడ ఉన్నవారిని అడిగి తెసుకోవాలి. హైదరాబాద్ లాంటి సిటీల్లో రూమ్ రూమ్ కూడా సిగ్నల్ ప్రాబ్లమ్ ఉంటుంది. అందుకే సొంతంగా మనమే ఏ నెట్ వర్క్ వస్తుందో చెక్ చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో మీ మొబైల్ ద్వారా ఆ నెట్ వర్క్ సిగ్నల్ బాగా వస్తుందో చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా, జియో టెలికాం కంపెనీలు అధికారిక వెబ్‌సైట్లలో నెట్‌వర్క్ కవరేజ్ మ్యాప్ ఫీచర్‌ను అందుబాటులో ఉంచాయి.

ఎయిర్‌టెల్
ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌లోని కవరేజ్ మ్యాప్‌లోకి వెళ్ళి మీ అడ్రస్ లేదా పిన్ కోడ్ (PIN Code) ఎంటర్ చేస్తే సరిపోతుంది. అక్కడ మీ ప్రాంతంలో ఎయిర్‌టెల్ 2G, 4G ఇంకా 5G నెట్‌వర్క్‌లు అందుబాటులో ఉన్నాయో లేదో మ్యాప్‌లో స్పష్టంగా తెలుస్తోంది. 4G, 5G కవరేజీని విడివిడిగా కూడా ఫిల్టర్ చేసుకుని కూడా చూసుకోవచ్చని ఎయిర్ టెల్ తెలిపింది.
జియో
జియో వెబ్‌సైట్‌లోని కవరేజ్ మ్యాప్‌లో మీ అడ్రస్ లేదా పిన్ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా మీ ఇంటి దగ్గర ఉన్న నెట్‌వర్క్ వివరాలు కనిపిస్తాయి. ఇందులో 4G, 5G సహా 4G+5G లభ్యతను వేర్వేరుగా చూసే ఆప్షన్లు అందుబాటులో ఉంచినట్లు జియో పేర్కొంది.
వోడాఫోన్ ఐడియా
Vi (వోడాఫోన్ ఐడియా) కూడా కస్టమర్ల కోసం ఈ సదుపాయాన్ని అందిస్తోంది. Vi అధికారిక వెబ్‌సైట్ సందర్శించి మీ టెలికాం సర్కిల్ లేదా ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా అక్కడ 5G ఇంకా 4G నెట్‌వర్క్ కవరేజ్ ఎంతవరకు ఉందో సులభంగా తెలుసుకోవచ్చని చెబుతున్నారు. అయితే ఏదైనా వేరే నెట్ వర్క్ కి పోర్ట్ అవ్వాలనుకునే వారు లేదా కొత్త సిమ్ తీసుకునే వారు ముందుగా ఈ విధంగా కవరేజ్ చెక్ చేసుకోవడం మంచిదని వివరిస్తున్నారు.
అయితే హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలో జియో నెట్ వర్క్ రావడం లేదని చాలా మంది చెబుతున్నారు. 5జీ సరిగా రావడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు. కొంత మంది తమ ఫోన్ కలవడం లేదని జియో నెట్ వర్క్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో సిగ్నల్ వస్తుందని.. హైదరాబాద్ లోని మోతినగర్, బోరబండ ఏరియాలో జియో సిగ్నల్స్ రావడం లేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications