Mutual Fund: నెలకు రూ.10 వేలతో కోటి రూపాయలు సంపాదించవచ్చు.. ఎలాగంటే..!

మ్యూచువల్ ఫండ్లలో సుదీర్ఘకాలం పెట్టుబడి పెడితే భారీ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొంత మొత్తం డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల భారీ ఆదాయం పొందవచ్చని వివరిస్తున్నారు. మీరు నెలకు రూ.10 వేల సిప్ తో కోటి రూపాయలను సంపాదించవచ్చు. నిప్పన్ ఇండియా వాల్యూ ఫండ్ తీసుకుంటే. ఇందులో నెలకు రూ.10 వేలతో సిప్ పెట్టుబడి పెట్టినవారు 21 ఏళ్ల తర్వాత రూ.1.56 కోట్లను సొంతం చేసుకున్నారు. నిప్పన్ ఇండియా వాల్యూ ఫండ్ ను 2005 ప్రారంభించారు. ఈ ఫండ్ 21 ఏళ్లలో 15 శాతానికి పైగా రాబడి ఇచ్చింది.

ఈ ఫండ్ లో 10 సంవత్సరాల క్రితం నెలకు రూ.10 వేల సిప్ పెట్టుబడి పెడితే 15.73 శాతం రాబడితో మీ సొమ్ము రూ.27,30,910 లక్షలు అయ్యేది. ఇందులో మీ పెట్టుబడి రూ.12 లక్షలు కాగా.. మీకు రూ.15,30,910 రాబడి వచ్చింది. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్ తీసుకుంటే. ఇందులో గత 10 సంవత్సరాల్లో 21.81 రాబడి ఇచ్చింది. మీరు ఇందులో 10 సంవత్సరాల క్రితం నెలకు రూ.10 వేల సిప్ మొదలు పెడితే మీ డబ్బు ఇప్పుడు రూ. 37,46,319 చేరేది. ఇందులో మీరు చెల్లించిన మొత్తం రూ. 12,55,466 కాగా.. మీకు రూ.24,90,853 రాబడి వచ్చింది.

mutual fund

మీరు మీ సిప్ లో సంవత్సరానికి 20 శాతం పెంచితే 10 సంవత్సరాల్లో రూ.31,15,042 పెట్టుబడి పెట్టే వారు. మీకు రూ. 40,24,153 రాబడితో పాటు మొత్తం రూ.71,39,195 వచ్చేవి. క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కూడా గత 10 ఏళ్లలో 21.03 శాతం రాబడి ఇచ్చింది. ఇందులో మీరు పదేళ్ల క్రితం రూ.10 వేల సిప్ స్టార్ట్ చేస్తే.. ఇప్పుడు మీ డబ్బు రూ. 36,54,011 అయ్యేది. మ్యుచల్ ఫండ్ లో స్టెప్ ఆఫ్ విధానం అమలు చేయడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మీ ఆదాయం పెరిగే కొద్ది మీ సిప్ ను స్టెప్ అప్ చేస్తే భారీ మొత్తం సొంతం చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

లంప్ సమ్ పెట్టుబడి కూడా భారీగా రాబడి వస్తుంది. నిప్పన్ ఇండియా వాల్యూ ఫండ్ లో 21 ఏళ్ల క్రితం రూ.1 లక్ష పెట్టుబడి పెడితే మీ సొమ్ము ఇప్పుడు రూ. 21.78 లక్షలకు చేరేది. ఇక నిప్పాన్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ల పదేళ్ల క్రితం రూ. లక్ష పెట్టుబడి పెడితే ఆ సొమ్ము ఇప్పుడు రూ. 7,19,166 అయ్యేది. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ లో పదేళ్ల క్రితం రూ.1 లక్ష పెట్టుబడి పెడితే మీ సొమ్ము రూ. 6,74,420 లకు చేరుకునేది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+