పొరుగు దేశం చైనాలో పుట్టిన మహమ్మారి కరోనా ప్రపంచాన్ని చుట్టేసింది. 700 కోట్ల ప్రజల బంగారు కలలను భస్వం చేసేసింది. కానీ మన ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్య నాథ్ మాత్రం కరోనా... గిరోనా జాన్తా నహి అంటూ అతి పెద్ద కల కంటున్నారు. తన రాష్ట్రాన్ని వచ్చే ఐదేళ్ల లో 1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ 80 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని సంకల్పం చేస్తున్నారు. ఇందుకోసం ఒక కన్సల్టెంట్ ను నియమంచుకోవాలని నిర్ణయం కూడా తీసుకున్నారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టినట్లు సమాచారం. అందులో అనేక అంశాలను ప్రస్తావించింది. దేశంలో ఉత్తర ప్రదేశ్ కు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దేశానికి అనేక మంది ప్రధానులను అందించిన రాష్ట్రంగా... దేశాన్ని పరిపాలించాలంటే ముందు ఉత్తర ప్రదేశ్ లో గెలవాలని భావిస్తారు. అది నిజం కూడా. అక్కడ అధిక సీట్లు గెలిచిన పార్టీనే దేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండటం పరిపాటిగా మారింది. అయితే ఇక పై కేవలం రాజకీయ క్రియాశీలక పాత్రనే కాకుండా ఆర్థికంగా కూడా దేశానికి దిశా నిర్దేశం చేయాలని యోగి ఆదిత్య నాథ్ భావిస్తున్నారు.

5 రెట్ల పెరుగుదల...
ఉత్తర ప్రదేశ్ అంటే ఇప్పటి వరకు నిరుద్యోగం, పేదరికం, రౌడీ ఇజం వంటి అంశాలకే కేంద్రంగా కనిపించేది. అభివృద్ధి లో ఎప్పుడూ దేశంలోని చాలా రాష్ట్రాలకంటే వెనుకబడి పోయి ఉండేది. అయితే ఇకపై అలా కాకుండా పారిశ్రామికంగా, ఆర్థికంగా రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలపాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కల ఐన 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ (దాదాపు రూ 400 లక్షల కోట్లు) గా భారత్ ను చూడాలని కోరుకుంటున్నారు. అది కూడా 2025 నాటికే దానిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ రమారమి 3 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ 240 లక్ష కోట్లు) గా ఉంది. కానీ, ఐదేళ్ళలో 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలంటే దేశం ప్రతి ఏటా 15% సగటు వృద్ధిని నమోదు చేయాలి. కానీ రెండేళ్లుగా దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం తో పాటు ప్రస్తుత కరోనా వైరస్ సంక్షోభం వృద్ధి ఆశలను అడియాశలు చేసింది. ఈ ఏడాది మన జీడీపీ వృద్ధి రేటు సున్నా శాతమే. అయితే, దీంతో సంబంధం లేకుండా ఉత్తర ప్రదేశ్ ను 2025 నాటికి 5 రెట్ల వృద్ధి నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రస్తుతం 230 బిలియన్ డాలర్లు...
దేశంలో జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశే. అక్కడ సుమారు 20 కోట్ల జనాభా ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఉత్తర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 230 బిలియన్ డాలర్లు గా ఉంది. సగటు జీ ఎస్ డీ పీ వృద్ధి రేటు 7% గా నమోదవుతోంది. కానీ, వచ్చే ఐదేళ్ళలో 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలంటే ఏటా కనీసం 50% వృద్ధి రేటును నమోదు చేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఇది దాదాపు అసాధ్యం. కానీ, ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు అనే సామెత నుంచి స్ఫూర్తి పొందిన యూపీ సీఎం ... ఎలాగైనా దానిని సాధించాలని కల కంటున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక అత్యుత్తమ కన్సల్టెంట్ ను నియమించుకుంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం రిక్వెస్ట్ ఫర్ ప్రపోసల్ కూడా జారీ చేసిందట. పుష్కలంగా ఉన్న మానవ వనరులను ఉపయోగించుకోవటం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం, సరికొత్త టెక్నాలజీ ని అందిపుచ్చుకోవటం, ప్రత్యేక ప్రాజెక్టులను చేపట్టటం, ప్రభుత్వ పరిపాలన లో సంస్కరణలు తీసుకు రావటం వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని భావిస్తున్నారు.

వాటితో పోటీ...
ఈ భారీ లక్ష్య సాధన కోసం... కొత్తగా వచ్చే కన్సల్టెంట్ దేశంలోని మూడు అత్యుత్తమ రాష్ట్రాల్లో ఉన్న నిర్మానాత్మక, వ్యవస్థాగత, ఆర్థిక విధానాలను పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే ప్రపంచంలోని మూడు అభివృద్ధి చెందిన దేశాలను కూడా ఇందుకోసం పరిశీలించాల్సి ఉంటుంది. ఐతే అవి ఉత్తర ప్రదేశ్ తో పోల్చదగినవిగా ఉండాలి. అన్ని రంగాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) విధానాల అవలంబనకు ఉన్న అవకాశాలు, వాటి అమలు కోసం తగిన వ్యూహాలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యంలో దేశం లోని నలుమూలల నుంచి బతుకు దెరువు కోసం వలస వెళ్లిన కార్మికులకు ఇకపై యూపీ లోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసింది. అలాగే తమ పౌరులను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని కూడా యూపీ సీఎం వెల్లడించారు. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే అక్కడ ఏదో జరుగుతుందని విశ్లేషకులు ఆశిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications