Gold News: వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో బంగారం ధర తగ్గుతుంది.. యెస్ సెక్యూరిటీస్ రిసెర్చ్ నివేదిక..!
గత సంవత్సరన్నరగా బంగారం ధర భారీగా పెరిగింది. సంవత్సరం క్రితం గోల్డ్ లో పెట్టుబడి పెట్టిన వారు భారీ లాభం పొందారు. ప్రస్తుతం బంగారం ధర రూ.1,43,000 నుంచి రూ.1,48,000 మధ్య పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. అయితే ఈ సమయంలో పసిడిలో పెట్టుబడి పెట్టడం సరైందేనా. లేక ఇంకా కొద్ది కాలం ఆగాలా అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అయితే బంగారం ధరకు సంబంధించి యెస్ సెక్యూరిటీస్ ఓ పరిశోధన నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం వచ్చే మూడు నుంచి ఐదు సంవత్సరాలలో తక్కువ రాబడి ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.
బుల్ మార్కెట్ లేకపోవడం, తక్కువ వాస్తవ వడ్డీ రేట్లు, ద్రవ్య విస్తరణ, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సెంట్రల్ బ్యాంకుల నిరంతర కొనుగోళ్ల మద్దతుతో బంగారం ధర భారీగా పెరిగిందని వివరించింది. కానీ.. భవిష్యత్ లో బంగారం ఇదే స్థాయిలో పెరిగే అవకాశం లేదని అంచనా వేసింది. అదే సమయంలో ఆర్థిక శక్తులు విలువైన లోహాల కంటే పారిశ్రామిక వస్తువులకు అనుకూలంగా ఉంటాయని తెలిపింది. ఏఐ, మౌలిక సదుపాయాలు, విద్యుదీకరణ, రక్షణ రంగ తయారీ మరియు రీషోరింగ్ కార్యక్రమాల వల్ల రాగి, అల్యూమినియం, విద్యుత్ పరికరాలు, ప్రత్యేక ఉక్కు, యురేనియంకు డిమాండ్ ఉంటుందని అంచనా వేసింది.

అయితే 2026 చివరి త్రైమాసికం నాటికి ఔన్సుకు ధరలు సగటున 6,000 డాలర్లకు చేరుకుంటాయని జె.పి. మోర్గాన్ గ్లోబల్ రీసెర్చ్ అంచనా వేసింది. 2027 చివరి నాటికి 6,300 డాలర్లకు పెరుగుతుందని పేర్కొంది. గారం ఒకరకమైన సాంకేతిక అనిశ్చిత స్థితిలో చిక్కుకుందని తెలిపింది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుతో స్పందించాల్సి వస్తుందేమోనన్న ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది పెట్టుబడిదారులు ప్రస్తుతానికి బంగారంపై అంతగా దృష్టి పెట్టడం లేదని పేర్కొంది. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడిపై మాత్రమే కాకుండా పెట్టుబడుల వైవిద్యీకరణ కొనసాగుతుందని వివరించింది.
అధిక ద్రవ్యోల్బణం, కొనుగోలు శక్తి క్షీణించండం, అమెరికా ఆర్థిక, బడ్జెట్ ఆందోళనలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులపై బంగారం ధర ఆధారపడే అవకాశం ఉందని అంచనా వేసింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications