Stock Market News: దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఎస్ బ్యాంకుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో కంపెనీలు ఈ బ్యాంకు ద్వారా లావాదేవీలు జరిపేందుకు గతంలో ఆసక్తి చూపించేవి. అయితే కరోనా ముందు బ్యాంకులో నెలకొన్న సంక్షోభంతో ఏకంగా దివాలా స్థాయికి దిగజారిపోయింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై ఉపశమన చర్యలు చేపట్టింది. తిరిగి కోలుకునేందుకు అవకాశం కల్పించింది. కాగా నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో ఈ స్టాక్ వండర్స్ సృష్టించింది.
మూడు రోజులుగా వరుస నష్టాలు నమోదు చేస్తున్న ఎస్ బ్యాంక్ నిన్న భారీ మెరుపులు మెరిపించింది. ఏకంగా 12 శాతం లాభాలు నమోదు చేసి ఇన్వెస్టర్లను ఆనందంలో ముంచెత్తింది. అంతకుముందు 3 రోజుల్లో దాదాపు అదే 12 శాతం పడిపోగా.. ఆ మొత్తాన్ని ఒక్కరోజులోనే తిరిగి రికవర్ చేయగలిగింది. దీనికి నిఫ్టీ కూడా మద్దతు ఇవ్వడంతో హద్దులు లేకుండా చెలరేగిపోయింది. బ్యాంక్ కొత్త ప్రమోటర్ కోసం వెతుకుతున్నట్లు మీడియాలో వార్తలు రావడంతో షేర్ల ధరలు ఆకాశానికి ఎగబాకాయి.

ఎస్ బ్యాంక్ మార్కెట్ విలువ 7.2 బిలియన్ డాలర్లు. కాగా 51 శాతాన్ని విక్రయించి మొత్తాన్ని 8-9 తొమ్మిది బిలియన్ డాలర్ల మేరకు పెంచుకోవాలని చూస్తున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. ఇండియాలోని సిటీ గ్రూప్ పొటెన్షియల్ బయ్యర్ కోసం సెర్చ్ మొదలు పెట్టిందని సమాచారం. అంతేకాక పలువురు దేశీయ లెండర్స్ మరియు పెట్టుబడిదారులకు కూడా సమాచారం పంపిందట. యూరప్, జపాన్ లోని పలువురు ఇన్వెస్టర్లతోనూ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.
అయితే రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఎవరైనా కొత్త ప్రమోటర్ 26 శాతం కంటే ఎక్కువ షేర్ హోల్డ్ చేయాలంటే రెగ్యులేటర్ ప్రత్యేక అనుమతి తప్పనిసరి. ఈ షేర్ల అమ్మకం ద్వారా LIC, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంకులు 2020లో ఇన్వెస్ట్ చేసిన మొత్తం నుంచి బయటికి వెళ్లేందుకు అవకాశం ఏర్పడనుంది. కానీ ఇవన్నీ నిరాధారమైన వార్తలని, బ్యాంకుకు ఆ ఆలోచన లేదని నిన్న తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.


Click it and Unblock the Notifications