YES Bank: నేడు ఫోకస్‌లో యెస్ బ్యాంక్ స్టాక్.. ఆ ఫేక్ వార్తపై క్లారిటీ ఇవ్వటంతో..
YES Bank Shares: వాస్తవానికి ప్రముఖ వార్తా సంస్థ కథనం ప్రకారం గత నాలుగేళ్లుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యెస్ బ్యాంకులో కలిగి ఉన్న 23.99 శాతం వాటాలను విక్రయించాలని చూస్తోందని పేర్కొనబడింది. దీనికోసం ఎస్బీఐ సరైన అంతర్జాతీయ ఇన్వెస్టర్ కోసం వేచిచూస్తున్నట్లు నివేదించబడింది.
ఈ క్రమంలో యెస్ బ్యాంకులోని 51 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు రాబోయే కొత్త పెట్టుబడిదారులకు రిజర్వు బ్యాంక్ అనుమతించినట్లు వచ్చిన మీడియా కథనాలను యెస్ బ్యాంక్ ఖండించింది. వాస్తవానికి బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం సాధారణ వ్యాపారంలో ప్రమోటర్ హోల్డింగ్ పరిమితి 26 శాతం కంటే ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. ఆర్‌బిఐ ఆర్టికల్‌లో పేర్కొన్న విధంగా సూత్రప్రాయంగా ఏదీ ఇవ్వలేదని, నిరాధారమైన మీడియా కథనాలను తొలగించాలని యెస్ బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. కంపెనీ ఇచ్చిన క్లారిటీ కారణంగా నేడు యెస్ బ్యాంక్, ఎస్బీఐ కంపెనీల షేర్లు మార్కెట్లో ఫోకస్ లో కొనసాగుతున్నాయి.

నివేదిక ప్రకారం ఆర్‌బీఐ ఇప్పటికీ బిడ్డర్‌ల ఫిట్-అండ్-ప్రాపర్ స్టేటస్‌ను యాక్సెస్ చేస్తోంది. బ్యాంక్ తగిన ప్రమోటర్లను షార్ట్‌లిస్ట్ చేయడానికి సిటీ గ్రూప్‌ను నియమించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, LIC వంటి ఇతర రుణదాతలు యెస్ బ్యాంక్‌లో మూడింట ఒక వంతు వాటాను కలిగి ఉన్నారు.
గత వారం యెస్ బ్యాంక్ జూన్ త్రైమాసికంలో లోన్స్ అండ్ అడ్వాన్స్‌లలో 14.8 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.2,29,920 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొంది. వాస్తవానికి గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లోన్స్ అండ్ అడ్వాన్స్‌లు కేవలం రూ.2,00,204 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది. ఇదే క్రమంలో డిపాజిట్లు 20.8 శాతం పెరిగి రూ.2,64,910 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.64,568తో పోలిస్తే జూన్ త్రైమాసికంలో 26.1 శాతం పెరిగి CASA రూ.81,405 కోట్లకు చేరిందని యెస్ బ్యాంక్ నివేదించింది.


Click it and Unblock the Notifications