Q4 Results: దుమ్ము దులిపిన యెస్ బ్యాంక్ ఫలితాలు.. డబుల్ అయిన నికర లాభం..
Yes Bank Q4 Results: ఈ ఏడాది బ్యాంకింగ్ కంపెనీల పనితీరు గతంలో కంటే మెరుగుపడింది. మార్చితో ముగిసిన సమయానికి కార్పొరేట్ ఫలితాలను వెల్లడిస్తున్న సంస్థలు సూపర్ లాభాలను నమోదు చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ యెస్ బ్యాంక్ నేడు తన నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్ తర్వాత ఫలితాలు వెల్లడించిన యెస్ బ్యాంక్ 2023-24 జనవరి-మార్చి త్రైమాసికానికి రూ.451 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. ఇది క్రితం సంవత్సరం ఇదే సమయంలో నమోదైన రూ.202 కోట్లతో పోలిస్తే 123 శాతం అధికం. దీంతో ఇన్వెస్టర్లలో బ్యాంక్ పనితీరుపై నమ్మకం పెరుగుతోంది.

ఈ కాలంలో బ్యాంక్ పనితీరును గమనిస్తే.. స్థూల నిరర్థక ఆస్తులు 1.7 శాతానికి తగ్గాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 2.2 శాతం కంటే ప్రస్తుతం మెుండి బకాయిలు తగ్గాయి. మరోవైపు త్రైమాసికంలో నికర NPA 0.6 శాతంగా నమోదయ్యాయి. ఇవి ఏడాది ప్రాతిపదికన 0.80 శాతం నుంచి తగ్గి మెరుగుపడ్డాయి. Q4FY24 స్థూల స్లిప్‌పేజ్‌లు Q3FY24లో రూ.1,233 కోట్లతో పోలిస్తే రూ.1,356 కోట్లుగా ఉన్నాయి. అలాగే బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ.2,153 కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నివేదించబడిన రూ.2,105 కోట్లతో పోలిస్తే స్వల్పంగా 2 శాతం పెరిగాయి.
నికర అడ్వాన్స్‌లు సంవత్సరానికి 13.8 శాతం వృద్ధి చెంది రూ.2.27 లక్షల కోట్లకు చేరుకున్నాయని బ్యాంక్ తన త్రైమాసిక ఫలితాల్లో ప్రకటించింది. మొత్తం డిపాజిట్లు 22.5 శాతం పెరిగి రూ.2.6 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ నికర వడ్డీ మార్జిన్‌లో కుదింపును చూసింది. ఇది Q4FY23లో 2.8 శాతం నుంచి ప్రస్తుతం 2.4 శాతానికి పడిపోయింది. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి స్టాక్ ధర బీఎస్ఈలో ఒక్కొక్కటి రూ.26.15 వద్ద ట్రేడింగ్ ముగించాయి.


Click it and Unblock the Notifications