Yes Bank Q3 Results: చాలా కాలంగా యెస్ బ్యాంక్ ఇన్వెస్టర్లు మంచిరోజుల కోసం వేచి చూస్తున్నారు. దాదాపు 5 ఏళ్ల కిందట కంపెనీలో జరిగిన అవకతవకల గురించి బయటకు రావటంతో పెట్టుబడిదారులు ప్రైవేటు బ్యాంకుపై నమ్మకం పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. సకాలంలో స్పందించిన రిజర్వు బ్యాంక్ దీనిని కుప్పకూలిపోకుండా నిరోధించింది.
ఆ సమయంలో యెస్ బ్యాంకులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ బ్యాంక్ వంటి సంస్థలు మూలధన అవసరాల కోసం భారీగా పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత బ్యాంక్ పనితీరు వరుసగా మెరుగుపడుతూ పెట్టుబడిదారుల్లో సంతోషాన్ని నింపుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో నికర లాభం మూడు రెట్లు పెరగటంతో రూ.612 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో బ్యాంక్ లాభం కేవలం రూ.231 కోట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. అంటే వార్షిక ప్రాతిపధికన కంపెనీ లాభాలు దాదాపు 165 శాతం వృద్ధిని సాధించాయి.

ఈ పరిస్థితులపై పెట్టుబడిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యెస్ బ్యాంకుకు తిరిగి మంచి రోజులు మెుదలయ్యాయని, కంపెనీ పనితీరు వేగంగా మెరుగుపడుతోందని వారు భావిస్తున్నారు. శుక్రవారం మార్కెట్ల ముగింపు నాటికి బ్యాంక్ షేర్ల ధర ఒక్కోటి రూ.18.25 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. ఇక మూడవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.9,341 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో బ్యాంక్ ఆదాయం రూ.8,179 కోట్లుగా ఉంది.
అలాగే బ్యాంక్ సమీక్షా కాలంలో వడ్డీ రూపంలో 7,829 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందింది. అయితే గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.6984 కోట్ల కంటే ఇది చాలా ఎక్కువ. నికర వడ్డీ ఆదాయం డిసెంబర్ త్రైమాసికంలో 10 శాతం పెరిగి రూ.2,224 కోట్లకు చేరింది. ఇక స్థూల నిరర్థక ఆస్తుల విషయానికి వస్తే గత ఏడాది త్రైమాసికంలో 2 శాతం నుంచి ప్రస్తుతం 1.6 శాతానికి తగ్గటంతో బ్యాంక్ ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. ఇదే క్రమంలో నికర మెుండి బకాయిలు ఏడాది ప్రాతిపదికన 0.9 శాతం నుంచి 0.5 శాతానికి తగ్గి మెరుగుపడ్డాయి.
బ్యాంక్ వరుసగా ఐదవ త్రైమాసికంలో బలమైన లాభాల వృద్ధిని సాధించటంపై సీఈవో, ఎండీ ప్రశాంత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఆస్తులపై లాభాలు భారీగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. వ్యాపారంలో కూడా తాము మంచి లాభాలను చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే త్వరలోనే బ్రోకరేజీలు కూడా ఫలితాలకు అనుగుణంగా స్టాక్ టార్గెట్ ధరలను అప్ గ్రేడ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బ్యాంక్ షేర్ల కొనుగోలుపై ఇన్వెస్టర్లు కూడా సరైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నవంబరులో యెస్ బ్యాంక్ షేర్లపై ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు కోటక్, జేఎం ఫైనాన్షియల్ సెల్ రేటింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications