FD పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. డిపాజిట్లకు ఫ్లోటింగ్ రేట్ వడ్డీ ప్రకటించిన యస్ బ్యాంక్..

YES Bank New FD: ప్రైవేట్ రంగంలోని యస్ బ్యాంక్ FDకి సంబంధించి ఆసక్తికరమైన ప్రకటన చేసింది. బ్యాంక్ ఒక ప్రత్యేక ఉత్పత్తిని ప్రవేశపెట్టింది. దీని కింద ఇకపై కస్టమర్లకు రెపో రేటు ఆధారంగా వడ్డీ లభించనుంది. అంటే.. ఇప్పుడు మీరు FDపై కూడా ఫ్లోటింగ్ రేట్ వడ్డీ రేటును పొందవచ్చు. ఇప్పటి వరకు ఈ విధానం లోన్లలో మాత్రమే వడ్డీ రేటులో మార్పులు చేసేవి బ్యాంకులు. కానీ ఇప్పుడు.. ఈ విధానాన్ని FDలో కూడా అమలు చేసేందుకు యస్ బ్యాంక్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.

ఫ్లోటింగ్ రేటు కింద.. రెపో రేటు తగ్గినప్పుడు లేదా పెరిగినప్పుడు వాటికి అనుగుణంగా FD వడ్డీ రేటు తగ్గడం లేదా పెరగటం జరుగుతుంది. ఇప్పటి వరకు స్థిర వడ్డీ రేటు కింద రెపో రేటు తగ్గినా లేదా పెరిగినా ముందుగా ఒప్పుకున్న వడ్డీ రేటును చెల్లిస్తున్నాయి బ్యాంకులు.

yes bank introdused dynamic repo rate linked fixed deposit scheme in india

మీకు లాభమా లేక నష్టమా?

ఈ మధ్య కాలంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయటంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును రెండుసార్లు పెంచింది. అటువంటి పరిస్థితిలో కొత్త విధానంలో రిజర్వ్ బ్యాంక్ రాబోయే రోజుల్లో మళ్లీ వడ్డీని పెంచినట్లయితే.. FDపై మీకు లభించే వడ్డీ కూడా పెరుగుతుంది. అయితే.. రిజర్వ్ బ్యాంక్ రెపోరేటు తగ్గిస్తే.. మీకు వచ్చే వడ్డీ కూడా తగ్గుతుంది. అంటే ఆర్బీఐ చేసే మార్పులకు అనుగుణంగా మీకు లభించే వడ్డీ రేట్లలో కూడా మార్పు ఉంటుంది. ఇందులో లాభం ఎంత ఉందో నష్టం కూడా అదే విధంగా ఉంటుంది.

యస్ బ్యాంక్ ఏం చెప్పింది?

యస్ బ్యాంక్ తన కొత్త ఆఫర్‌లో.. కస్టమర్లు ఎఫ్‌డీలపై డైనమిక్ రిటర్న్‌లను పొందుతారని స్పష్టం చేసింది. బ్యాంక్ ప్రకారం.. 'ఫ్లోటింగ్' రేట్ ప్రయోజనాన్ని ఒక సంవత్సరం నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధిలో తీసుకోవచ్చు. బ్యాంక్ MD, CEO ప్రశాంత్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఉత్పత్తిలో వడ్డీ రేటులో సవరణ ఆటోమెటిక్ గా అమలు చేయబడుతుంది. అంటే.. బ్యాంకు లేదా కస్టమర్ ఏ వైపు నుంచి మానవ జోక్యం అవసరం ఉండదు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+