మరికొద్ది రోజుల్లో ఈ ఏడాది అయిపోయి కొత్త ఏడాది రాబోతుంది. అయితే ఎప్పటిలాగే ఈ సారికూడా డేట్ మారడంతో పాటు ఇయర్ కూడా మారుతుంది. కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో చాల మంది కొత్త కొత్త రిజల్యూషన్స్ తీసుకుంటుంటారు. అయితే ట్రావెలింగ్ ఇష్టపడే వారు ఈ ఏడాదిలో బెస్ట్ ప్లేసెస్ కోసం చూస్తుంటారు. అయితే భారతీయులు ఈ ఏడాది గూగుల్లో ఏ ప్రదేశాల కోసం ఎక్కువ సెర్చ్ చేసారో తెలుసా... దీనికి సంబంధించి గూగుల్ ఒక లిస్ట్ విడుదల చేసింది.
అజర్‌బైజాన్, ఈ దేశం చారిత్రకు, ప్రకృతి సౌందర్యానికి ఫెమస్ ఇంకా గూగుల్ లిస్టులో మొదటి స్థానాన్ని పొందింది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు భారత్ నుంచి 1,40,000 మంది పర్యాటకులు అజర్‌బైజాన్‌ను సందర్శించారు. పెరుగుతున్న పర్యాటకాన్ని చూసి స్పెషల్ విమానాలు కూడా ప్రారంభించారు.

ఇండోనేషియాలోని పాపులర్ నగరం బాలి ఇక్కడ అద్భుతమైన బీచ్‌లు, పురాతన దేవాలయాలు, చక్కటి ప్రదేశాలకు ప్రసిద్ధి. ఈ ప్రదేశంకి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు వస్తారు.
మనాలి హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక నగరం, ఇక్కడికి ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ ప్రకృతి ప్రదేశాలు మాల్ రోడ్ నుండి రోహ్తంగ్ వ్యాలీ వరకు ఉన్నాయి.
2023 సంవత్సరంలో భారతదేశం నుండి కజకిస్తాన్కి 29,000 మంది పర్యాటకులు సందర్శించారు, అయితే ఈ సంవత్సరం మాత్రం పర్యాటకుల సంఖ్యా 49% పెరిగింది. ఈ దేశానికి వీసా అవసరం లేదు, దింతో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వెళ్తుంటారు.
భారతదేశంలోని రాజస్థాన్‌లోని పింక్ సిటీ జైపూర్ కూడా పర్యాటకులకి చాల ఇష్టమైన ప్రదేశం. ఇక్కడ అమెర్ కోట, హవా మహల్, లోకల్ మార్కెట్ టూరిస్టులను బాగా ఆకర్షిస్తాయి.
యూరప్ అండ్ ఆసియా మధ్య ఉన్న ఈ నగరం చాలా అందంగా ఇంకా పర్వతాల మధ్య ఉంటుంది. ఇది ఒక చారిత్రక నగరం ఇంకా పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా కూడా ఉంటుంది. ఈ దేశం ప్రత్యేకమైన సాంస్కృతి, అందమైన దృశ్యాలకు మంచి స్పాట్.
వివిధ సాంస్కృతిలకు ఏకైక దేశం మలేషియా. భారతదేశం, చైనా, మలేషియా, శ్రీలంక ఇంకా ఇతర ఆసియా దేశాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. కౌలాలంపూర్ ఇక్కడ అత్యంత ఫెమస్ అండ్ రంగుల నగరంగా పరిగణిస్తారు.
శ్రీరాముడి భూమి రామ్ జీ నగరం అయోధ్య ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నగరం భారతదేశంలోని ప్రముఖ యాత్రా స్థలం. ఈ ఏడాది రామ మందిర ప్రతిష్ఠాపన సమయంలో కూడా చాలా మంది విదేశీ పర్యాటకులు ఇక్కడ సందర్శించారు.
కాశ్మీర్ నగరం భూమిపై స్వర్గన్నీ తలపిస్తుంది. మంచు కొండలు, ప్రకృతి అందాలు ఇక్కడికి వచ్చే వారిని కట్టిపడేస్తాయి. ప్రతి సంవత్సరం ఇక్కడికి విదేశాల నుండి కూడా ప్రజలు హిమపాతం చూడడానికి వస్తారు.
సౌత్ గోవా, గోవాలోని దక్షిణ ప్రాంతాన్ని సౌత్ గోవా అంటారు. ఇక్కడి ప్రశాంతమైన, శుభ్రమైన బీచ్‌లు, విలాసవంతమైన రిసార్ట్‌లు ఇంకా సహజ సౌందర్యం ఇక్కడి ప్రదేశాన్ని టూరిస్ట్స్ డెస్టినీగా మార్చాయి. కొత్త సంవత్సరం సందర్బంగా ఇక్కడికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు.


Click it and Unblock the Notifications