Year Ender 2024: ఈ ఏడాదిలో కిక్కిచ్చిన టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ ఇవే.. వావ్ 82% రిటర్న్స్...!!
ఈ ఏడాది 2024లో ఇంకా కేవలం 10 రోజుల మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గత 12 నెలల్లో పెట్టుబడిదారులకు మంచి రిటర్న్స్ అందించాయి. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మొత్తం 472 ఈక్విటీ ఫండ్లలో 7 మ్యూచువల్ ఫండ్స్ 50% కంటే ఎక్కువ రాబడినిచ్చాయి. మిగిలిన మూడు ఫండ్స్ దాదాపు 49% రాబడితో 50%కి దగ్గరగా ఉన్నాయి. టాప్-10లో 6 ఫండ్స్ మోతీలాల్ ఓస్వాల్ సొంతం కావడం గమనార్హం. ఈ ఏడాది టాప్-10 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఏంటో ఓ లుక్ వేద్దాం...
ముఖ్యంగా మిరాయ్ అసెట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ టాప్ 10లో మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. మిరాయ్ అసెట్ NYSE ఫాంగ్ ప్లస్ ETF FOF 82.43 శాతం రాబడితో అగ్రస్థానంలో నిలిచింది. మరే ఇతర ఈక్విటీ ఫండ్ ఇంత రిటర్న్స్ ఇవ్వలేదు.

*మిరాయ్ అసెట్ S&P టాప్ 50 ETF FOEP 63.73 శాతం రాబడితో రెండవ స్థానంలో నిలిచింది.
*మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 60.52 శాతం రాబడితో మూడో స్థానంలో ఉంది.
*ఎల్‌ఐసీ మ్యూచువల్ ఇన్‌ఫ్రా ఫండ్ ఈ ఏడాది 52.52 శాతం రాబడితో నాలుగో స్థానంలో నిలిచింది.
*మోతీలాల్ ఓస్వాల్ ELSS పన్ను సేవింగ్స్ ఫండ్ 50.49 శాతం రాబడితో ఐదవ స్థానంలో ఉంది.
*మోతీలాల్ ఓస్వాల్ నాస్‌డాక్ 100 FOF స్కిం 50.37 శాతం రాబడితో ఆరవ స్థానంలో ఉంది.
*మోతీలాల్ ఓస్వాల్ స్మాల్ క్యాప్ ఫండ్ 49.29 శాతం వృద్ధితో 8వ స్థానంలో ఉంది.
*మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ 48.48 శాతం రాబడితో 9వ స్థానంలో ఉంది.
*హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీ ఫండ్ ఈ ఏడాది ప్రారంభించినప్పటికీ 48.75 శాతం రాబడితో 10వ స్థానంలో ఉంది. రక్షణ రంగానికి చెందిన మార్కెట్‌లో ప్రస్తుతం యాక్టీవ్ గా ఉన్న ఏకైక స్కిం ఇదే కావడం గమనార్హం.
ముఖ్యంగా టాప్ 10 స్కీమ్స్ లో 6 మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్‌కు చెందినవి. ఈ సంవత్సరం 455 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చాయి. 0.22 శాతం నుంచి 47.59 శాతం వరకు లాభాలను రిజిస్టర్ చేశాయి. కేవలం 7 ఈక్విటీ ఫండ్స్ మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ ఫండ్స్ అని గమనించాలి. అన్ని రంగాలకు చెందిన ఫండ్స్ పరిగణనలోకి తీసుకుని జనవరి 1 నుండి 17 డిసెంబర్ 2024 వరకు డేటా ఆధారంగా లిస్ట్ రూపొందించబడింది.


Click it and Unblock the Notifications